Man Viral Video: 22 ఏళ్లుగా స్నానం చేయని వ్యక్తి.. కారణం తెలిస్తే మీరు ఫిదా అవుతారు..

Updated on: Aug 09, 2022 | 8:36 PM

స్నానం చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే రోజూ రెండుపూటలా స్నానం చేసేస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం.. గత 22 ఏళ్లుగా స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. ఇలా స్నానం చేయకుండా


స్నానం చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే రోజూ రెండుపూటలా స్నానం చేసేస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం.. గత 22 ఏళ్లుగా స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. ఇలా స్నానం చేయకుండా ఉండడానికి కూడా ఓ రీజన్ చెబుతున్నాడు అతను. ఆ కారణం తెలిస్తే కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తే.. మరికొందరు షాక్ తింటున్నారు. ఈ వ్యక్తి బీహార్ కు చెందినవాడు. వివరాల్లోకి వెళ్తే..

బిహార్ లోని పాల్​గంజ్ జిల్లా, బైకుంఠపుర్​కు చెందిన 62 ఏళ్ల ధరమ్​దేవ్ రామ్.. 2000 సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఈ విషయం గురించి తెలిసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ధరమ్ దేవ్ ఇన్ని ఏళ్లుగా స్నానం చేయకపోయినా.. అతని శరీరం నుంచి దుర్వాసన లేదు. ఎప్పుడూ అనారోగ్యంబారిన పడలేదు. ధరమ్ దేవ్ 40 ఏళ్ల వయసులో తాను జీవితంలో స్నానం చేయనని అసాధారణమైన ప్రతిజ్ఞ చేశారు. ధరమ్‌దేవ్ రామ్ మహిళలపై నేరాలు, భూ వివాదాలు, జంతు వధలు అరికట్టే వరకు స్నానం చేయనని శఫధం చేశారు. స్నానం చేయడం వల్ల తన పని వృధా అవుతుందని అందువల్లనే స్నానం చేయడం లేదని చెప్పారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన ప్రతిజ్ఞకు కట్టుబడే ఉన్నారు ధరమ్​దేవ్. చివరికి, తన భార్య, పిల్లలు చనిపోయిన సమయంలో కూడా స్నానం చేయలేదు. ధర్మదేవ్‌ నిర్ణయానికి అతనికి కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 09, 2022 08:36 PM