Viral: అయ్యయ్యో.. 22 ఏళ్లుగా ఖైదీ.. విడుదలకు కాసేపటి ముందే పరారీ..!

|

Oct 03, 2023 | 1:11 PM

పలు కోర్టులు నేరస్తులను నిర్ణీత కాలం తర్వాత విడుదల చేస్తున్నాయి. వారికి నచ్చినట్టు మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా ఒక నేరస్తుడు విడుదలకు కొద్దిసేపటి ముందు పరారైన ఉదంతం రష్యాలోని మార్కోవా జైలులో ఆసక్తికరంగా మారింది. కమోల్జోన్ కలోనోవ్ అనే ఖైదీ విడుదల కావాల్సిన రోజే జైలు నుండి తప్పించుకున్నాడు.

పలు కోర్టులు నేరస్తులను నిర్ణీత కాలం తర్వాత విడుదల చేస్తున్నాయి. వారికి నచ్చినట్టు మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా ఒక నేరస్తుడు విడుదలకు కొద్దిసేపటి ముందు పరారైన ఉదంతం రష్యాలోని మార్కోవా జైలులో ఆసక్తికరంగా మారింది. కమోల్జోన్ కలోనోవ్ అనే ఖైదీ విడుదల కావాల్సిన రోజే జైలు నుండి తప్పించుకున్నాడు. డబుల్ మర్డర్, దొంగతనం, అక్రమ ఆయుధాల సరఫరా లాంటి క్రిమినల్ కేసులలో గత 22 సంవత్సరాలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత విడుదల కావాల్సిన రోజు రానే వచ్చింది. అయితే ఆ ఖైదీ అదే రోజున తెల్లవారుజామున 4 గంటలకు జైలు నుండి అదృశ్యమయ్యాడు. దీంతో జైలు అధికారులు సదరు ఖైదీ పరారైనట్లు ప్రకటించడంతో పాటు అతనిపై మరొక కేసు నమోదు చేశారు. 2001లో అతను డబుల్ మర్డర్‌లో దోషిగా తేలడంతో అతనికి 22 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. తాజాగా అతను విడుదల కావాల్సిన రోజు రాగానే జైలు నుండి పరారయ్యాడు. విడుదలైన అనంతరం కమోల్జోన్ కలోనోవ్‌ను కూలీ పనులకు పంపించాలనుకున్నారు. బహుశా ఈ పనులు చేయడం ఇష్టంలేకనే కమోల్జోన్ పరారయ్యాడని జైలు అధికారులు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..