Vijayawada: నా చావుకు నా భార్యే కారణం.. సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు..!

|

Oct 15, 2023 | 6:21 PM

ఒంటరితనం, భార్య వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి.. కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలతో పాటు, భార్యకు దూరమైన ఓ వ్యక్తి బతకలేక, తీవ్ర మనస్థాపంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య, ఆమెకు సహకరించిన మరి కొంతమంది అంటూ రాసి మరీ తనువు చాలించాడు. విజయవాడ కృష్ణలంకలో జరిగిన ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఒంటరితనం, భార్య వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి.. కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలతో పాటు, భార్యకు దూరమైన ఓ వ్యక్తి బతకలేక, తీవ్ర మనస్థాపంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య, ఆమెకు సహకరించిన మరి కొంతమంది అంటూ రాసి మరీ తనువు చాలించాడు. విజయవాడ కృష్ణలంకలో జరిగిన ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణలంకకు చెందిన బిల్డర్ అనిల్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అతనికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ కృష్ణలంకలో శంకర్ మఠం సమీపంలో కూతురు ఇంట్లోని నాలుగవ అంతస్తులో ఒంటరిగా ఉంటున్నాడు. సొంతింట్లో ఉంటున్న భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అనిల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనిల్ మృతి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. ఆత్మహత్యకు ముందు బిల్డర్ అనిల్ రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. తమ వద్ద పనిచేసిన డ్రైవర్‌తో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని రాశాడు. తనను మానసికంగా వేధింపులకు గురిచేసి ఆస్తి మొత్తాన్ని ఆమె పేరున రాయించుకుందని అందులో వివరించారు. తన చావుకు భార్యతోపాటు, ఆమెకు సహకరించిన మరికొందరి పేర్లను సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. దీంతో ఈ సూసైడ్ నోట్ ఆధారంగా కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..