Viral: ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. తాగిన మత్తులో స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసిన ఫ్రెండ్స్‌.

|

Sep 06, 2024 | 7:05 PM

మద్యం మత్తులో తోటి కొలీగ్‌ని బలవంతంగా ఈతకొలనులో నెట్టగా మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ ఘట్​కేసర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. మదాపూర్​లో ఓ ఐటీ సంస్థలో టీం లీడర్​గా పని చేస్తున్న శ్రీకాంత్ ఘట్​కేసర్​లోని ఓ గెస్ట్​ హౌస్ లో పార్టీ ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం ఉద్యోగులు మొత్తం 20 మంది వచ్చారు. అక్కడ మద్యం సేవించారు. రాత్రి 12గంటల తర్వాత కేక్ కట్​ చేసి పార్టీ చేసుకున్నారు.

మద్యం మత్తులో తోటి కొలీగ్‌ని బలవంతంగా ఈతకొలనులో నెట్టగా మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ ఘట్​కేసర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. మదాపూర్​లో ఓ ఐటీ సంస్థలో టీం లీడర్​గా పని చేస్తున్న శ్రీకాంత్ ఘట్​కేసర్​లోని ఓ గెస్ట్​ హౌస్ లో పార్టీ ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం ఉద్యోగులు మొత్తం 20 మంది వచ్చారు. అక్కడ మద్యం సేవించారు. రాత్రి 12గంటల తర్వాత కేక్ కట్​ చేసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో అజయ్​ తేజ అనే వ్యక్తిని అతని స్నేహితులు రంజిత్​ రెడ్డి, సాయికుమార్ ఈత కొలనులోకి నెట్టేందుకు ప్రయత్నించారు. అందుకు అజయ్​ తేజ తనకు ఈత రాదని వేడుకున్నాడు. అయినా వాళ్లిద్దరు వినలేదు. మద్యం మత్తులో అజయ్​తేజ ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. అతని మాటలు లెక్కచేయకుండా స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈతరాని అజయ్ ​తేజ మృతి చెందాడు. 45 నిమిషాల తర్వాత వారందరు పూల్ వద్దకు రాగా అపస్మారక స్థితిలో ఉన్న అజయ్​చూసి కంగారు పడి వెంటనే జీడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు మృతి చెందాడని ధ్రువీకరించారు. సోమవారం తెల్లవారుజాము 3గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకుని మృతిదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి మేనమామ కిశోర్​కుమార్​ ఫిర్యాదు మేరకు స్నేహితులు రంజిత్​ రెడ్డి, సాయికుమార్​, శ్రీకాంత్​, గెస్ట్​హౌస్​ నిర్వాహకుడు వెంకటేశ్​లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on