Man bit Snake: కాటేసిన పామును కొరికి చంపాడు.. ఒడిసాలో గ్రామస్థుడి సాహసం.. వైరల్ వీడియో..

Updated on: Sep 14, 2022 | 9:43 AM

విషపూరిత పాములు కాటేస్తే.. క్షణాల్లోనే చనిపోయే అవకాశం ఉంది. అయితే.. తాజాగా ఓ షాకింగ్ సీన్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పాము కాటేసిందని ఓ వ్యక్తి.. దానిపై


విషపూరిత పాములు కాటేస్తే.. క్షణాల్లోనే చనిపోయే అవకాశం ఉంది. అయితే.. తాజాగా ఓ షాకింగ్ సీన్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పాము కాటేసిందని ఓ వ్యక్తి.. దానిపై ప్రతీకారం తీసుకున్నాడు. కింగ్ కోబ్రాను పట్టుకొని నోటితో కొరికి కొరికి చంపాడు. ఒడిశాలోని దారాదా గ్రామం వరి పొలంలో పని చేస్తున్న సమయంలో సలీం ఖాన్ అనే వ్యక్తికి నాగుపాము కాటేసింది. అయితే, సలీంఖాన్ వెంటనే వైద్యులను ఆశ్రయించే బదులు.. పామును పట్టుకుని నోటితో కొరికి కొరికి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. అతను పామును పట్టుకొని కొరుకుతుండటాన్ని చూసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆ తర్వాత సలీం ఖాన్ అంతటితో ఆగలేదు. చనిపోయిన పామును తన మెడలో వేసుకొని గ్రామంలో తిరిగాడు.పాము కాటు తర్వాత అతనికి ఎలాంటి నొప్పి అనిపించలేదని.. చనిపోయిన నాగుపామును మెడలో వేసుకుని సలీం సైకిల్‌పై వెళ్లడం తాము చూశామని.. చూస్తుంటేనే భయం వేసిందని గ్రామస్థులు సంబాద్ తెలిపాడు. పాము కాటు వేసిన తర్వాత నాటు వైద్యం చేయించుకున్నానని సలీం ఓ వార్తా సంస్థకు తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 14, 2022 09:43 AM