Huge Python: చేపల వలలో చిక్కుకున్న భారీ కొండచిలువ.. వామ్మో ఎంత పెద్ద పామో..
చేపల వలలో ఓ భారీ కొండచిలువ చిక్కింది. అది నదిలోనో, సముద్రంలోనో చేపల కోసం వలవేస్తే చిక్కలేదు. ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చిన కొండ చిలువ పొదల పక్కన పడేసిన చేపల వలలో చిక్కుకుపోయింది. బయటకు రాలేక నానా అవస్థలు పడుతున్న కొండ చిలువను గుర్తించిన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. 40 నిమిషాలపాటు శ్రమించి సురక్షితంగా కొండచిలువను బయటకు తీశారు.
చేపల వలలో ఓ భారీ కొండచిలువ చిక్కింది. అది నదిలోనో, సముద్రంలోనో చేపల కోసం వలవేస్తే చిక్కలేదు. ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చిన కొండ చిలువ పొదల పక్కన పడేసిన చేపల వలలో చిక్కుకుపోయింది. బయటకు రాలేక నానా అవస్థలు పడుతున్న కొండ చిలువను గుర్తించిన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. 40 నిమిషాలపాటు శ్రమించి సురక్షితంగా కొండచిలువను బయటకు తీశారు. ఈ ఘటన విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. భీమిలిలోని శుభాష్ కాలనీలో ఓ ఆశ్రమం వెనుక ఉన్న పొదల వద్ద చేపల వల ఉంది. అందులో ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ భారీ కొండచిలువ చిక్కుకుంది. దానిని గమనించిన స్థానికులు జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్‌కు సమాచారమిచ్చారు. ఆయన వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్‌కు ఫోన్ చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాడు కిరణ్. వైర్లన్నీ కొండచిలువకు చుట్టుకుపోయి తీవ్ర గాయాలతో ఉన్న కొండచిలువను 40 నిమిషాలు శ్రమించి బయటకు తీసి, దానికి వైద్యం చేయించి అడవిలో వదిలిపెడతానని తెలిపాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..