Creative irrigation: మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం.! ఈ పద్ధతిలో వ్యవసాయం..
ప్రపంచ చరిత్రలో భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి విశిష్ట ప్రత్యేకత ఉంది. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం గురించి మనం చదువుకునే ఉంటాము...
ప్రపంచ చరిత్రలో భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి విశిష్ట ప్రత్యేకత ఉంది. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం గురించి మనం చదువుకునే ఉంటాము. అధునికత లేని కాలంలోనే వినూత్న వ్యవసాయ పద్దతులతో పంటలను సమృద్ధిగా పండించారు. అయితే, తాజాగా ఓ రైతు వినూత్న తరహాలో వ్యవసాయం చేస్తున్నాడు. సృజనాత్మకతతో భారతీయులు ప్రతీ ఒక్కరినీ ఓడించగలరని మరోసారి రుజువైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ రైతు ట్రేడ్‌మిల్ వంటి యంత్రంపై ఎద్దును నడిపిస్తూ సాగుకు కావాల్సిన నీటిని, మోటర్ల సాయంతో కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాడు. కాగా, ఎద్దు ట్రేడ్‌మిల్ వంటి యంత్రంపై నడుస్తుండగా పైపుల ద్వారా నీరు పంట పొలాలకు చేరుతోంది. అలాగే, మోటర్ల సాయంతో కరెంట్‌ను సైతం ఉత్పత్తి చేసి పంటల సాగుకు వాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..