Body builder: 30 ఏళ్లకే ప్రముఖ బాడీ బిల్డర్ మృతి.. షాక్‌లో 85 లక్షల మంది..
జర్మనీకి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జో లిండ్నర్ మరణం అతడి ఫాలోవర్లను షాక్‌కు గురిచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని 85 లక్షల మంది అనుసరిస్తున్నారు. తన ఫిట్‌నెస్ వీడియోలతో యూట్యూబ్‌లో దాదాపు 50 కోట్ల వ్యూస్ సొంతం చేసుకొన్నాడు.
జర్మనీకి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జో లిండ్నర్ మరణం అతడి ఫాలోవర్లను షాక్‌కు గురిచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని 85 లక్షల మంది అనుసరిస్తున్నారు. తన ఫిట్‌నెస్ వీడియోలతో యూట్యూబ్‌లో దాదాపు 50 కోట్ల వ్యూస్ సొంతం చేసుకొన్నాడు. మూడు రోజుల క్రితం అరుదైన వ్యాధితో స్నేహితురాలు నిచా సమక్షంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని నిచా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. అతడు మెడనొప్పితో బాధపడిన మూడు రోజుల్లోనే కన్నుమూశాడని వెల్లడించింది. లిండ్నర్ మరణం బాడీబిల్డింగ్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.
లిండ్నర్ మరణంతో కండరాల పెంపు కోసం అనుసరించే పద్దతులపై మరోసారి చర్చ మొదలైంది. జో లిండ్నర్ సాధారణంగా దుబాయ్, థాయ్‌లాండ్‌లో ఫిట్‌నెస్ వీడియోలను చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పోస్టు చేసేవాడు. అవి అతడికి చాలా పేరు తెచ్చిపెట్టాయి. వాస్తవానికి అతడు కండరాల వ్యాధి రిపీలింగ్ మజిల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో కండరాలు ఒత్తిడికి గురైన సమయంలో భిన్నంగా స్పందిస్తాయి. సాధారణంగా కండరంపై ఒత్తిడి పెంచితే ఓ రకమైన రసాయనిక చర్య ద్వారా అవి మొత్తం ఒక చోటకు చేరి బలంగా కనిపిస్తాయి. కానీ, రిపిలింగ్ మజిల్ డిసీజ్ ఉన్నవారిలో కండరాలు విపరీతమైన ఒత్తిడికి గురై ఒకే కండరంలా కాకుండా వేర్వేరుగా అలల వలే కనిపిస్తాయి. ఇలా కనీసం 20 సెకన్ల వరకు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో క్రాంప్ ఏర్పడి ఓ గడ్డలా వచ్చి విపరీతమైన నొప్పికి కారణం కావచ్చు. తనకున్న ఈ సమస్యను జో లిండ్నర్ తరచూ ప్రస్తావించేవాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...