Viral: మంచినీళ్లు అడిగిన దివ్యాంగుడిపై దాడి.. కారణం ఇదే..! వైరల్ వీడియో..
రాత్రి తన వాహనంపై ఇంటికి బయలుదేరిన అతడికి రోడ్డు మీద ఓ తాబేలు కనిపించింది. అతడు దాన్ని తీసుకుని ఆలయ సమీపంలోని కొలనులో విడిచిపెట్టాడు. ఆ తరువాత అక్కడ కనిపించిన ఇద్దరు ప్రాంతీయ రక్షక జవాన్లను మంచినీళ్లు అడిగాడు. ఈ మాత్రానికే వారు రెచ్చిపోయి అతడిని చావచితక కొట్టారు. సమీపంలోని ఓ వ్యక్తి ఈ ఉదంతాన్ని తన మొబైల్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది.
ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. దాహం తీర్చుకునేందుకు మంచి నీళ్లు అడిగిన ఓ దివ్యాంగుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు ఇద్దరు జవాన్లు. ఈ దారుణ ఘటన దేవరీయా ప్రాంతంలో వెలుగు చూసింది. 2016లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో సచిన్ అనే వ్యక్తి తన రెండు కాళ్లూ కోల్పోయాడు. ప్రస్తుతం అతడు స్థానిక రెస్టారెంట్‌లో డెలివరీబాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి తన వాహనంపై ఇంటికి బయలుదేరిన అతడికి రోడ్డు మీద ఓ తాబేలు కనిపించింది. అతడు దాన్ని తీసుకుని ఆలయ సమీపంలోని కొలనులో విడిచిపెట్టాడు. ఆ తరువాత అక్కడ కనిపించిన ఇద్దరు ప్రాంతీయ రక్షక జవాన్లను మంచినీళ్లు అడిగాడు. ఈ మాత్రానికే వారు రెచ్చిపోయి అతడిని చావచితక కొట్టారు. సమీపంలోని ఓ వ్యక్తి ఈ ఉదంతాన్ని తన మొబైల్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. నిందితులను రాజేంద్ర మణి, అభిషేక్ సింగ్‌గా గుర్తించారు. వారిని విధుల నుంచి తొలగించినట్టు జిల్లా వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...