Snake bite: విచిత్ర సంఘటన.. ఆడుకుంటున్న బాలుడిని కాటేసి, క్షణాల్లో చనిపోయిన పాము..
బీహార్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని ఓ భారీ పాము కాటు వేసింది. ఇందులో విచిత్రమేముంది అనుకుంటున్నారా...
బీహార్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇంటిముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని ఓ భారీ పాము కాటు వేసింది. ఇందులో విచిత్రమేముంది అనుకుంటున్నారా… పాము కాటు వేసిన బాలుడు క్షేమంగా ఉన్నాడు.. కానీ కాటు వేసిన మరుక్షణం ఆ పాము చనిపోయింది. ఈ ఘటనం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..బీహార్‌లోని మధోపుర్ గ్రామానికి చెందిన రోహిత్ కుశ్వాలాకు అనూజ్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. అనూజ్ తన తల్లితో సహా కుచాయ్కోట్లో ఉన్న అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. రోజులాగే అనూజ్ ఇంటి ముందు ఆడుకుంటుడగా.. ఓ పాము బాలుడిని కాటు వేసింది. దీంతో, అనూజ్ ఏడ్చుకుంటూ వెళ్లి పాము కాటు వేసిందని తల్లికి చెప్పాడు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు.. అనూజ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అనూజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. బాలుడిని కాటు వేసిన కొద్దిసేపటికే పాము చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులుతో పాటు స్థానికులు షాకయ్యారు. అనంతరం, ఆ పామును ఓ డబ్బాలో వేసి స్థానికులు.. అధికారులకు అందజేశారు. ఇక, ఈ విషయం ఆనోటా ఈనోటా చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. దాంతో బాలుడిని చూసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Aliens coin: యువకుడికి దొరికిన ఏలియన్స్ నాణెం.. సోషల్ మీడియాలో కాయిన్‌పై రచ్చ..!
Priest: మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి.. ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే..
Runner @105: రన్నర్@105.. రాంబాయి రూటే సపరేటు.. వీడియో చుస్తే మెచ్చుకోవడం ఖాయం..
