Viral: పారిపోదామనుకున్నాడు.. చెరువులో పడి చనిపోయాడు.! అసలేం జరిగిందంటే..

|

Oct 02, 2023 | 9:22 AM

పెద్దపల్లి జిల్లాలో ఓ దొంగ మహిళ మెడలో గొలుసు లాక్కొని పారిపోతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ముత్తారం మండలం సర్వారంలో బొంతల రాజ్‌ కుమార్‌ అనే 35 ఏళ్ల వ్యక్తి తరచూ దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 28న ఓ చోట చోరీ చేయడానికి విఫల యత్నం చేశాడు. అక్కడ వర్కవుట్‌ కాకపోవడంతో సర్వారంలోని పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళ వద్దకు వెళ్లి వేధించడం మొదలు పెట్టాడు.

పెద్దపల్లి జిల్లాలో ఓ దొంగ మహిళ మెడలో గొలుసు లాక్కొని పారిపోతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ముత్తారం మండలం సర్వారంలో బొంతల రాజ్‌ కుమార్‌ అనే 35 ఏళ్ల వ్యక్తి తరచూ దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 28న ఓ చోట చోరీ చేయడానికి విఫల యత్నం చేశాడు. అక్కడ వర్కవుట్‌ కాకపోవడంతో సర్వారంలోని పొలంలో పనిచేసుకుంటున్న ఓ మహిళ వద్దకు వెళ్లి వేధించడం మొదలు పెట్టాడు. భయంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలంలో పనిచేసుకుంటున్నవారు గమనించి అక్కడికి చేరేలోపు దొంగ పారిపోయాడు. లాభం లేదనుకున్న దొంగ సర్వారంలోని ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్న మహిళ దుకాణంలో కూర్చుని ఉండగా అక్కడకు వెళ్లి ఆమె మెడలోని పుస్తెలతాడు తెంపుకొని పారిపోయాడు. మహిళ దొంగ దొంగ అంటూ అరవడంతో చుట్టుపక్కలవాళ్లు దొంగవెంట పడ్డారు. వారినుంచి తప్పించుకునే క్రమంలో దొంగ సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు. దొంగతనానికి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..