Cave Video: మొక్కనాటేందుకు గుంత తవ్వుతుండగా బయటపడిన గుహ.. గుహలో పురాతన వస్తువులు..

|

Sep 01, 2022 | 9:20 PM

కర్ణాటకలోని సుల్లియా జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. కడబ తాలూకాలోని ఎడమమంగళ గ్రామంలో కల్లెంబి విశ్వనాథగౌడ్‌కు చెందిన స్థలంలో సీతాఫలం మొక్క నాటేందుకు గుంత తవ్వుతుండగా


కర్ణాటకలోని సుల్లియా జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. కడబ తాలూకాలోని ఎడమమంగళ గ్రామంలో కల్లెంబి విశ్వనాథగౌడ్‌కు చెందిన స్థలంలో సీతాఫలం మొక్క నాటేందుకు గుంత తవ్వుతుండగా పురాతన గుహ ఒకటి బయటపడింది. గడ్డపారతో మట్టి తవ్వుతుండగా.. భూమిలోని ఒకవైపు భాగం ఊడిపోయి గుహ లాంటి నిర్మాణం కనిపించింది. దాని లోపల నిశితంగా పరిశీలించగా వివిధ ఆకృతుల్లో ఉన్న మట్టి కుండలు, గిన్నెలు, చిన్న పాత్రల అవశేషాలు కనిపించాయి. గుహలో రెండు వేర్వేరు గదులు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఉడిపి శిర్వాలోని MSRS కళాశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ టి మురుగేశి నేతృత్వంలోని టీమ్ ఈ గుహపైన, అందులో లభించిన వస్తువులపైనా అధ్యయనం చేస్తోంది. క్షుణ్ణంగా శాస్త్రీయ పరీక్షలు జరిపిన తర్వాత మాత్రమే వాటి మూలానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్వకాలంలో భూమి లోపల చిన్న చిన్న గుహలను ఏర్పాటు చేసి వివిధ వస్తువులు పాతిపెట్టేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ గుహ గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

 

Published on: Sep 01, 2022 09:20 PM