Viral Video: ఆయుష్షు గట్టిదైతే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి.. రెప్పపాటు క్షణంలో పెను ప్రమాదం ఎలా తప్పిందో చూడండి.

Viral Video: మన ఆయుష్షు గట్టిదైతే ఎలాంటి పరిస్థితులైనా మనకు అనుకూలంగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగినా క్షేమంగా బయటపడుతుంటారు. నిజంగానే...

Viral Video: ఆయుష్షు గట్టిదైతే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి.. రెప్పపాటు క్షణంలో పెను ప్రమాదం ఎలా తప్పిందో చూడండి.
Viral Video

Updated on: Sep 03, 2021 | 10:56 AM

Viral Video: మన ఆయుష్షు గట్టిదైతే ఎలాంటి పరిస్థితులైనా మనకు అనుకూలంగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగినా క్షేమంగా బయటపడుతుంటారు. నిజంగానే అలాంటి సందర్భాల్లో ఈ భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయని అనిపించకమానదు. ఇదిలా ఉంటే తృటిలో తప్పే ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది.

ఇద్దరు కుర్రాలు బ్రిడ్జిపై నుంచి కింద ఉన్న సముద్రం నీటిలోకి దూకుతున్నారు. మొదట కుర్రాడు క్షేమంగా నీటిలోకి దూకాడు. అయితే రెండో కుర్రాడు దూకిన కేవలం రెండు క్షణాల్లోనే పెద్ద షిప్‌ ఒకటి సరిగ్గా కుర్రాడు దూకిన చోటుకే వచ్చింది. ఒకవేళ ఆ కుర్రాడు రెండు సెకన్లు ఆలస్యంగా దూకినా పెను ప్రమాదం జరిగేది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. మిమాలజీ అనే పేరుతో ఉన్న ఇన్‌స్టా్గ్రామ్‌ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘దేవుడు మిమ్మల్ని నిజంగా బతికించాలని అనుకున్నప్పుడు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన కొందరు ఆశ్చర్యపోతుండగా, మరికొందరు.. ‘ఆహా ఏమి ఈ అదృష్టం ఇది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Doorstep Banking: ఎస్‌బీఐ డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌.. ఇంటి వద్దనే రూ.20 వేల వరకు పొందవచ్చు

Siddharth Shukla: బాలీవుడ్ ఫేం సిద్ధార్ధ్ శుక్లా హఠాన్మరణంలో రహస్యాలేంటి.? ముందు రోజు రాత్రి అసలేం జరిగింది.?

Viral Video: అడవి దున్నను సజీవంగా పీక్కు తిన్న హైనాలు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!