Viral Video : ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో.. జోరు వానలో చెల్లి కోసం అన్నఆరాటం..!

|

May 24, 2023 | 10:01 PM

అమ్మలో సగం, నాన్నలో సగం కలిపితే అన్న అంటారు. అందుకే అన్నాచెల్లి, అన్నా తమ్ముడు బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అన్న స్థానంలో ఉన్న వ్యక్తి తన కుటుంబ సభ్యులను కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. అన్న అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు.

అమ్మలో సగం, నాన్నలో సగం కలిపితే అన్న అంటారు. అందుకే అన్నాచెల్లి, అన్నా తమ్ముడు బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అన్న స్థానంలో ఉన్న వ్యక్తి తన కుటుంబ సభ్యులను కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. అన్న అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు. తన చెల్లి, తమ్ముడు లను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. తాజాగా తన చెల్లికోసం అన్న పడిన ఆరాటానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. అన్నా, చెల్లి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతలో భారీ వర్షం కురుసింది. దాంతో ఆ అన్నయ్య తన చెల్లి వర్షంలో తడకుండా ఉండేందుకు తన టీ షర్ట్‌నే చెల్లికి గొడుగుగా పట్టాడు. చిన్నారి చెల్లిని తన టీషర్ట్‌లోకి దూర్చి.. పరుగు పరుగున తన కారులోకి వచ్చాడు. కారులో వచ్చాక.. చెల్లి వర్షంలో తడిచిపోయిందేమోనని పరిశీలించాడు. తల చెరిగి పోవడంతో తన చేతినే దువ్వెనగా చేసి చెల్లి తలను సరిచేస్తాడు. ఆ సమయంలో చిన్నారి చెల్లి ముఖంలో చిరునవ్వు చూసి సంబరపడిపోయాడు ఆ బుల్లి అన్నయ్య. ఈ సీన్ అంతా కారులో కూర్చున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు అబ్బురపడిపోతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: May 24, 2023 09:58 PM