తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది చూసి అంతా షాక్‌

Updated on: Jun 13, 2025 | 5:52 PM

తమిళనాడులోని మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఉదనపట్టీ గ్రామంలో అద్భుత సంఘటన జరిగింది. ఏప్రిల్ నెలలో జరిగిన సాధారణ తవ్వకాల సందర్భంగా 800 ఏళ్ల నాటి శివాలయం బయటపడింది. ఈ ఆలయం, గత కొన్ని శతాబ్దాలుగా భూమిలోపల దాగి ఉంది. ఈ చారిత్రక ఆలయం బయటపడిన విషయం తెలియడంతో.. దేవి ఆర్కియాలాజికల్ రిసెర్చ్ సెంటర్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త అరివుసెల్వం నేతృత్వంలోని శిల్ప విభాగం నిపుణులు సమగ్ర పరిశోధన చేపట్టారు.

వారి అధ్యయనాల్లో ఈ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, ఆవిర్భావం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని శిల్పాలు, శాసనాలను పరిశీలించగా.. ఈ ఆలయం మారవర్మన్ సుందర పాండ్యన్-I కాలం నాటిదని.. ముఖ్యంగా 1217-1218 AD మధ్యకాలం నాటిదని నిర్ధారణకు వచ్చారు. శాసనాల్లో ఈ ఆలయానికి ‘తెన్నవన్ ఈశ్వరమ్’ అని పేరు పెట్టినట్లు తేలింది. ఉదనపట్టీ గ్రామాన్ని ఆ కాలంలో ‘అత్తూరు’ అని పిలిచేవారని తేల్చారు. పాండ్యుల రాజవంశపు ప్రత్యేక శైలి ఈ ఆలయ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. విగ్రహాల అమరిక, శిల్పాలు, ఆలచ నిర్మాణశైలి ఆ కాలానికి చెందిన చారిత్రక విశిష్టతను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆలయంలో శివలింగంతో పాటు వినాయకుడు, దక్షిణామూర్తి, అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. ఈ చారిత్రక ఆలయం గురించి తెలియడంతో.. స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆలయ నిర్మాణాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. తమిళనాడు సంపదగా నిలిచిన ఆలయ వారసత్వానికి ఈ శివాలయం మరో ఉదాహరణ అని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన జంట.. రాత్రికి రాత్రే

విధి లిఖితం అంటే ఇదే కావచ్చు! ఒక్క రోజు తేడాతో ఈ స్టార్ హీరోల ఇళ్లలో తీవ్ర విషాదం

కనిపించింది కొద్దిసేపే అయినా.. కుర్రాళ్లను కనికట్టు చేసిందిగా..

చేసిన రచ్చ ఫలితం.. కల్పిక పై పోలీస్‌ కేస్‌

కాంతార2 టీంలో వరుస మరణాలు.. విషాదంలో మూవీ యూనిట్

Loading...
Unable to load recommendations.
Follow Us