కాసేపట్లో అంత్యక్రియలు.. దగ్గుతూ లేచి కూర్చున్న మృత దేహం

Updated on: Jul 25, 2025 | 1:39 PM

జీవితంలో అప్పుడప్పుడూ అనుకోని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి ఎన్నో సంఘటనలు నెట్టింట వైరల్‌ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి చనిపోయారనుకున్న వ్యక్తులు బ్రతికి వస్తే ఆ కుటుంబం ఆనందం చెప్పక్కర్లేదు. అలాంటి ఆశ్చర్యకరమైన సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. డాక్టర్లు చనిపోయాడని నిర్ధారించిన 75 ఏళ్ల వ్యక్తి ఊహించని విధంగా అంత్యక్రియల వేళ లేచి కూర్చున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. యమునా నగర్‌ జిల్లాలోని కోట్‌ మజ్రి ప్రాంతంలో షేర్‌ సింగ్‌ అనే 75 ఏళ్ వ్యక్తి అస్వస్థతకు గురవడంతో అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అతడు కోలుకునే ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్పటంతో, అతని కుటుంబ సభ్యులు వెంటిలేటర్ అలాగే ఉంచి.. ఇంటికి తీసుకుపోయారు. దీంతో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులంతా వచ్చి.. ఆయనను చూసి వెళ్లారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అతడికి అమర్చిన వెంటిలేటర్ తీసి.. కింద కూర్చోబెట్టి స్నానం చేయిస్తున్నారు. దీంతో ఆ పెద్దాయన ఒక్కసారిగా కళ్లు తెరిచి గట్టిగా దగ్గటం ప్రారంభించాడు. దీంతో అక్కడి వారంతా షాక్ తిన్నారు. అంతలోనే తేరుకుని అతనికి మంచినీరు తాగించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం షేర్‌సింగ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతను కోలుకుంటున్నట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీధి కుక్క దాదాగిరీకి నెటిజన్లు ఫిదా

ఫ్రెండ్స్‌తో నైట్ అవుట్‌కు బయలుదేరిన భగీరా.. వీడియో చూస్తే షేకే

రూ.4.3 కోట్ల కారు కొని… ఇంట్లో వేలాడదీశాడు

ఈ రాయి విలువ రూ. 44 కోట్లు.. ఏముంది రా అంతగా దీనిలో ..

అందం, ఆరోగ్యం కోసం సూపర్ ఫుడ్స్.. తప్పకుండా తీసుకోండి.. సరదాగా..