ఫ్లైఓవర్‌ప నుంచి వాహనదారులపై ఊడిపడ్డ పైప్‌ లైన్

Updated on: May 30, 2024 | 5:31 PM

హర్యాణాలోని కర్నాల్ లో 44వ జాతీయ రహదారి పై మంగళవారం పెను ప్రమాదం చోటుచేసుకుంది. పానిపట్–చండీగఢ్ హైవేపై ఉన్న ఓ ఎలివేటెడ్ హైవే కు అడుగు వైపున ఏర్పాటు చేసిన పైపులైన్‌ ఒక్కసారిగా ఊడిపడింది. 700 మీటర్ల పొడవైన ఈ వర్షపునీటి డ్రెయిన్ పైప్ 50 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద వెళ్తున్న వాహనదారులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు.

హర్యాణాలోని కర్నాల్ లో 44వ జాతీయ రహదారి పై మంగళవారం పెను ప్రమాదం చోటుచేసుకుంది. పానిపట్–చండీగఢ్ హైవేపై ఉన్న ఓ ఎలివేటెడ్ హైవే కు అడుగు వైపున ఏర్పాటు చేసిన పైపులైన్‌ ఒక్కసారిగా ఊడిపడింది. 700 మీటర్ల పొడవైన ఈ వర్షపునీటి డ్రెయిన్ పైప్ 50 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద వెళ్తున్న వాహనదారులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జాం ఏర్పడింది. గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా భారీ ఇనుప పైప్ ను వారు పైకి లేపలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఎలివేటెడ్ హైవేకు సమాంతరంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ పాతది కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాన్ని చూశారా

పేదల పిల్లలే వాళ్ళ టార్గెట్.. అపహరించటం.. విక్రయిచటం..

అరగంటలో విమానం పేలిపోతుందని బాత్రూమ్ లో కాగితం !! చివరికి ??

Loading...
Unable to load recommendations.
Follow Us