Heart Touching: తండ్రిని బతికించుకోవడానికి ఓ పసివాడి తపన.. ఆరేళ్ళ వయస్సులో ఎంత కష్టం..

|

Feb 20, 2023 | 9:04 AM

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తండ్రిని బతికించుకోవడానికి ఆరేళ్ల బాలుడు పడిన తపన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మండే ఎండలో..

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తండ్రిని బతికించుకోవడానికి ఆరేళ్ల బాలుడు పడిన తపన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మండే ఎండలో.. నడి రోడ్డుపై తన చిట్టి చేతులతో తండ్రిని తోపుడు బండిపై తోసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బండి ముందు వైపు తల్లి, తండ్రి పరిస్థితిని గమనిస్తూ ఆ పసివాడికి సాయపడుతుంటే.. ఆ చిన్నారి బండిని తోసుకుంటూ పరుగులు తీస్తున్నాడు. దాదాపు మూడు కిలోమీటర్లు నడిచాక బాలుడు కాళ్లూ, చేతులు నొప్పిపుట్టడంతో బండిని పట్టుకుని రోడ్డుపై కూర్చుండిపోయాడు. ఆ పసి ప్రాణం పడుతున్న ఆవేదన చూపరులను కలచివేసింది. మధ్యప్రదేశ్‌ సింగ్రౌలీలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కనీసం అంబులెన్స్‌ సదుపాయం కూడా కల్పించలేని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణ జరపాలని అధికారులు ఆదేశించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 20, 2023 09:04 AM