షాకింగ్ ఘటన.. అప్పుడే పుట్టిన శిశువును చూసి వైద్యులు షాక్ వీడియో
సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు ఎంత ఉంటుంది? మహా అంటే మూడు నుంచి మూడున్నర కిలోలు ఉంటుంది. పుట్టినప్పుడు శిశువు మూడు కిలోల బరువు ఉంటే ఆ బేబి ఆరోగ్యంగా ఉన్నట్టే. కానీ మధ్యప్రదేశ్ లో ఒక బాబు పుడుతూనే ఏకంగా ఐదు కిలోల బరువుతో పుట్టి వైద్యులకే షాకిచ్చాడు. ఈ అరుదైన ఘటన బుధవారం మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
జబల్ పూర్ కు చెందిన శుభాంగి అనే గర్భిణీకి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం చేయగా పండంటి మగ బిడ్డ జన్మించాడు. అనంతరం శిశువు బరువును తూకం వేయగా ఏకంగా 5.2 కిలోలు ఉండడంతో ఆపరేషన్ చేసిన వైద్యులు సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రసవం చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ భావన మిశ్రా మాట్లాడుతూ ఇంత ఎక్కువ బరువుతో శిశువు జన్మించడం చాలా అరుదైన విషయం. నా వైద్య వృత్తిలో ఇంత బరువున్న నవజాత శిశువును చూడడం ఇదే మొదటిసారి అని తెలిపారు. సాధారణంగా పుట్టినప్పుడు మగ శిశువులు 2.8 నుంచి 3.2 కిలోల వరకు ఆడ శిశువులు 2.7 నుంచి 3.1 కిలో వరకు బరువు ఉంటారని ఆమె వివరించారు. ఇంతటి భారీ బరువుతో పుట్టినప్పటికీ తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం సంతోషకరమని ఆమె అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
