డంపింగ్‌ యార్డ్‌ కింద శివాలయం 500 ఏళ్లైనా చెక్కు చెదరలేదు..

|

Jan 14, 2025 | 3:51 PM

బిహార్ రాజధాని పాట్నాలో 500 సంవత్సరాల పురాతన శివాలయం బయట పడింది. డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని శుభ్రపరుస్తుండగా వార్డ్ నెం. 54లో ఈ పురాతన దేవాలయాన్ని కనుగొన్నారు. ఈ స్థలం ఒకప్పుడు మఠానికి అనుసంధానంగా ఉండేదని చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆసక్తి కలిగించింది. స్థానికులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి తరలివస్తున్నారు.

స్థానికులు స్వయంగా తవ్వకాలు చేపట్టారు. శిథిలాలు తొలగించగా..ఆలయ పూర్తి నిర్మాణం వెలుగు చూసింది. అందరూ కలిసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. లోపల, ఒక పురాతన శివలింగం, రెండు ప్రత్యేకమైన పాదముద్రలు ఉన్నాయి. ఆలయ గోడలపై అంతుచిక్కని విధంగా నీటి చెమ్మ రావడాన్ని స్థానికులు గుర్తించారు. ఎంతో సుందరంగా అప్పట్లో నల్లరాతితో ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. అప్పటివరకు చెత్తకుప్పగా ఉన్న ఆ స్థలం.. అంతలోనే ప్రార్థనా స్థలంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఆలయం గురించి పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేపట్టారు. ఈ ఆలయం 15వ శతాబ్దానికి చెందినదిగా నిపుణులు భావిస్తున్నారు. ఈ శివాలయం గురించి వార్తలు వైరల్ అయినప్పటి నుంచి, చాలా మంది ప్రజలు..పూజలు చేసేందుకు ఆ ప్రాంతానికి వస్తున్నారు. పూలు, పాలు, స్వీట్లు సమర్పిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తం తవ్వకం పూర్తికాకముందే కొందరు ఆ ప్రాంతాన్ని పూలతో అలంకరించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలయ్యతో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ??

అభిమానులకు బాలయ్య ఫోన్‌.. పట్టరాని సంతోషంలో ఫ్యాన్స్‌

Daaku Maharaaj: డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య సినిమా రెండురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

గేమ్ ఛేంజర్ సినిమాపై కుట్ర.. పోలీస్‌ స్టేషన్లో కేసు

పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు.. ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా !!