Chennai Rains: రైల్వే స్టేషన్ చుట్టూ నీరు.. ఆ 500 మంది ప్రయాణికులకూ దిక్కేది.?
భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని దక్షిణ జిల్లాలు జలమయంగా మారాయి. ఫలితంగా దాదాపు 800 మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో చిక్కుకుపోయారు. తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కురిసిన భారీ వర్షాలకు తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇదివరకే వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని దక్షిణ జిల్లాలు జలమయంగా మారాయి. ఫలితంగా దాదాపు 800 మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో చిక్కుకుపోయారు. తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇదివరకే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలతో శ్రీ వైకుంఠంలోని రైల్వే స్టేషన్ చుట్టూ నీరు చేరింది. రైలు పట్టాలు దెబ్బతినడంతో రైళ్లు రాకపోకలు సాగించే పరిస్థితి లేకపోయింది. దాంతో ప్రయాణికులు స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు. ఆ స్టేషన్‌కు వెళ్లే రహదారి కూడా దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. NDRF వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. హెలికాప్టర్ల ద్వారా వారికి ఆహారం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.