పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

Updated on: Feb 06, 2025 | 7:28 PM

ఓ యువకుడు పక్కింట్లోని యువతిని..తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఇది గమనించిన ఆ యువతి అతన్ని నిలదీసింది. ఆ తరవాత ఆమె కుటుంబ సభ్యులు వచ్చి యువకుడిపై దాడి చేశారు. ఓ గదిలో నిర్భంధించారు. ఆ తర్వాత యువకుడి కుటుంబసభ్యులకు చెప్పడంతో వారొచ్చి తలుపుతీసి చూసి షాకయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా ఫూల్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన గొందేటి తాతారావు, పార్వతి దంపతులకు ముగ్గురు సంతానం.. రెండో కుమారుడు భాస్కరరావు విశాఖలోని ఫార్మాసిటీలో ఉన్న ఒక కంపెనీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అయితే.. అతను గాజువాక శ్రీనగర్‌ సమీప శ్రీరాంనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ రోజు ఉదయం పక్కింటి యువతిని వీడియో తీశాడు. అది గమనించిన యువతి కుటుంబ సభ్యులు భాస్కరరావును నిలదీశారు. వీడియోను డిలీట్‌ చేయించి చేయి చేసుకున్నారు. గదిలో పెట్టి తాళం వేశారు. అనంతరం గది బయట తాళం వేసి విజయనగరంలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి చూడగా గదిలోని కేబుల్‌ వైరుతో ఉరేసుకుని కనిపించాడు భాస్కరరావు. అప్పటికే అతను చనిపోయిన ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరిపారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి సహా మరో నలుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ముఖంపై గాయాలున్నాయని, కావాలనే తమ కుమారుడిని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ హీరో చాలా స్పెషల్.. కానీ ఆ విషయమే నచ్చదు..

మహా కుంభమేళాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..

ఎట్టకేలకు ‘టాక్సిక్’ సెట్‌లోకి స్టార్ హీరోయిన్..

కాఫీ చేదుగా ఉండడం వెనుక అసలు కారణం ఇదే!

సామాన్యుల కోసం లగ్జరీ రైళ్లు..మారిన కాజీపేట స్టేషన్ రూపురేఖలు