కారులో ప్రయాణిస్తూ నదిని దాటబోయారు.. చివరికి ??
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్మోరాలోని రామ్‌గంగా నదిని కొందరు యువకులు తమ కారులో ప్రయాణిస్తూ దాటాలనుకున్నారు. అది కాస్తా బెడిసి కొట్టడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఢిల్లీ లోని ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ఉత్తరాఖండ్ వెళ్లారు. మహీంద్రా థార్ వాహనంలో ప్రయాణిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు యత్నించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్మోరాలోని రామ్‌గంగా నదిని కొందరు యువకులు తమ కారులో ప్రయాణిస్తూ దాటాలనుకున్నారు. అది కాస్తా బెడిసి కొట్టడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఢిల్లీ లోని ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ఉత్తరాఖండ్ వెళ్లారు. మహీంద్రా థార్ వాహనంలో ప్రయాణిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు యత్నించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదిలో నీటి మట్టం బాగా పెరిగి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వారి వాహనం మధ్యలోనే నిలిచిపోయింది. వెంటనే ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ యువకులు వాహనంపైకి ఎక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముగ్గురు యువకుల్లో ఒకరు లైఫ్ జాకెట్ ధరించారు. ఒడ్డున కొంత మంది నిల్చొని వీరిని గమనిస్తున్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వారిని కాపాడేదుకు కొందరు సిద్ధంగా ఉన్నారు. అయితే వారంతా కలిసే విహారయాత్రకు వచ్చారా అనే విషయంపై స్పష్టత లేదు. లైఫ్ జాకెట్ వేసుకున్న యువకుడు మొదట నదిలోకి దూకేశాడు. నది ఉధృతికి కొట్టుకుపోతున్న అతణ్ణిని ఒడ్డునున్న వారు రక్షించారు. మిగతా ఇద్దరు సైతం కాసేపటి తర్వాత నదిలో నుంచి సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇలాంటి సాహసాలతో ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: