కంగారు కైకు.. కదులుతున్న రైలు ఎక్కబోయాడు.. చివరికి

Updated on: Jul 02, 2025 | 1:50 PM

కదులుతున్న రైలును ఎక్కబోయి దిగబోయి చాలా మంది ప్రాణాల పైకి తెచ్చుకుంటే.. మరి కొంతమంది గాయాలపాలై నరకయాతన అనుభవిస్తున్నారు. రైలు పూర్తిగా ఆగాకనే ప్రయాణికులు రైల్లో ఎక్కాలని.. రైలు నుంచి దిగాల్సిన వాళ్లు ఆగిన తర్వాతే సేఫ్ గా దిగాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని కోవిల్ పట్టి రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ వ్యక్తి ప్లాట్‌ఫారమ్‌, రైలు మధ్యలో చిక్కుకున్నాడు.

వీర ప్రసాద్ అనే 28 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో కలిసి తిరువారూర్‌ జిల్లాకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అక్కడ కదులుతున్న అంత్యోదయ రైలును ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి ప్లాట్‌ఫారమ్‌, రైలు మధ్యలో చిక్కుకుపోయాడు వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. ప్రమాదాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించి, ప్రయాణికుడిని రైలు, ప్లాట్‌ఫారమ్‌ మధ్య నుంచి బయటకి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. డ్రిల్లర్లతో ప్లాట్‌ఫారమ్‌ కొంత భాగాన్ని ధ్వంసం చేసి, చాలా కష్టపడిన తర్వాత అతన్ని బయటకు తీశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి మూలన చిన్న రంధ్రం నుండి వింత శబ్దాలు.. దగ్గర వెళ్లి చూసి ఖంగు తిన్నారు.

క్రెడిట్ స్కోరు లో తేడా వచ్చిందా ?? బతుకు బస్ స్టాండే.. ఎక్కడా అప్పు పుట్టదంతే