20 అడుగుల గిరి నాగుపాము.. చూస్తే వణుకు పుట్టాల్సిందే !!
పాములను చూసినా, ఆ పేరు విన్నా ఒళ్లంతా గగుర్పాటుకు గురవుతుంది. ఒక్కసారిగా గుండె వేగం పెరిగి వణికిపోతాం. శరీరమంతా చెమటలు పట్టేస్తాయి.
పాములను చూసినా, ఆ పేరు విన్నా ఒళ్లంతా గగుర్పాటుకు గురవుతుంది. ఒక్కసారిగా గుండె వేగం పెరిగి వణికిపోతాం. శరీరమంతా చెమటలు పట్టేస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ నాగుపాములను చూసే ఉంటారు. కానీ ఇలాంటి నాగుపామును చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ పాము ఐదారడుగులు కాదు.. ఏకంగా 20 అడుగుల పొడవు ఉంది. అందులోను మళ్లీ ఓ ఆరు అడుగుల వరకు పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. మరి అలాంటి పామును చూడాలంటే గుండెల్లో ధైర్యం ఉండాల్సిందే. ఇలాంటి కింగ్ కోబ్రాలు ఎక్కువగా కేరళ, ఆ సమీప ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఇవి అధికంగా దట్టమైన ఆడవుల్లో మాత్రమే ఉంటాయి.. జనావాసాల్లోకి రావడం చాలా అరుదు. కానీ ఇప్పుడు ఆ కింగ్ కోబ్రాలు ఆంధ్రప్రదేశ్‌లోనూ దర్శనమిస్తున్నాయి. ఏపీలోని పశ్చిమ ఏజెన్సీలో గిరినాగులు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం పామాయుల్ తోటల్లో దాదాపు 20 అడుగుల పొడవు ఉన్న ఈ గిరి నాగు సంచరిస్తూ జనాలను ముచ్చెమటలు పట్టించింది. ఈ భయంకరమైన గిరి నాగలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: