1638 కార్డులతో జల్సా.. కట్ చేస్తే గిన్నిస్ రికార్డు.. కారణం అదే
క్రెడిట్ కార్డులు అంటే కేవలం షాపింగ్ లేదా బిల్లులు చెల్లించడం వరకే అనుకుంటాం. ఒకవేళ డబ్బులు తీస్తే.. వడ్డీ ఎక్కువని, లాభం కంటే నష్టమే ఎక్కువని అనుకుంటారు చాలా మంది. అందుకే క్రెడిట్ కార్డులకు దూరంగా ఉంటారు. కానీ మనీష్ ధమేజా మాత్రం నష్టం కంటే లాభమే ఎక్కువని నమ్ముతారు. నమ్మటమే కాదు.. అది ఎలాగో కార్డులు వాడి మరీ చూపిస్తున్నాడు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1638 క్రెడిట్ కార్డులను ఎంచక్కా వాడేస్తున్నారు. అంతేనా సున్నా అప్పుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం కూడా సంపాదించుకున్నారు. మనీష్ ధమేజా దగ్గర ప్రస్తుతం..1,638 చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులున్నాయి. వీటిని ఇంట్లో పెట్టటానికే పరిమితం చేయకుండా రెగ్యులర్‌గా తన అవసరాలకు మనోడు వాడుటం విశేషం. పైగా, ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా మేనేజ్ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, షాపింగ్ అంతా క్రెడిట్ కార్డుల ద్వారానే చేసి.. సమయానికి వాటి బిల్లులను కట్టేస్తారు. ఇలా తరచుగా వాడడం వల్ల ఆ కార్డులకు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, విమాన ప్రయాణ ప్రయోజనాలు, హోటల్ వంటి కూపన్లను అందుకుని వాటిని వాడుకుంటున్నాడు. మనీష్ ఏదైనా ట్రిప్‌కు వెళ్లాలన్నా.. ఉచితంగా ఉండే కార్డులను వెంట తీసుకెళ్లి వాటిని మాత్రమే వినియోగిస్తుంటారు. ఇలా రూపాయి ఖర్చు లేకుండా ట్రిప్ పూర్తి చేస్తుంటారు. అయితే ఇలాంటి అధిక లాభాలను పొందేందుకు మాత్రమే.. మనీష్ ఈ కార్డులను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఆర్థిక అంశాలను తెలివిగా ప్లాన్ చేసినప్పుడు.. సామాన్యమైన ఆర్థిక సాధనాలు కూడా అసాధారణ విజయాలుగా ఎలా మారగలవో మనీష్ నిరూపించారు. ఇన్ని కార్డులు ఉండి, రూపాయి అప్పు లేకుండా, వాటి ద్వారా వచ్చే అవకాశాలన్నింటిని అందిపుచ్చుకుని.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న మనీష్ గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
K- Ramp: కే ర్యాంప్ సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం.. అబ్బా అనిపించాడా ?? తెలియాలంటే వీడియో చూసేయండి
పిల్లలకు పేర్లు పెడుతూ కోట్ల సంపాదన.. ఒక్కో పేరుకు రూ. 27 లక్షలు
త్వరలో వందే భారత్ 4.0.. గంటకు 320 కి.మీ స్పీడ్
