పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట.. ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా ??
ఇప్పటి వరకూ రెండు నాగుపాములు సయ్యాటకు సంబంధించిన వీడియోలు నెట్టింట చూశాం.. ఇటీవలే నడిరోడ్డుపై నాగుపాముల ట్రయాంగిల్ రొమాన్స్ కూడా చూశాం. రోడ్డుమీద పెనవేసుకున్న మూడు భారీ నాగుపాములను చూసి వాహనదారులు సైతం రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఆపేసి మరీ ఆ దృశ్యాలను మొబైల్స్‌లో బంధించి నెట్టింట పోస్ట్ చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 15 అడుగుల పొడవైన రెండు కింగ్ కోబ్రాల సయ్యాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కురుపాం మండలంలోని ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో కొందరు గ్రామస్తులు ఓ చోట చేరి అంతా ముచ్చటించుకుంటున్నారు. ఇంతలో అటుగా ఓ భారీ కింగ్ కోబ్రా దూసుకొచ్చింది. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు ఆ గిరినాగును చూసి. అలా ఆ కింగ్ కోబ్రా ముందుకు వెళ్లిపోగానే కొన్ని క్షణాల్లోనే మరో భారీ రాచనాగు దూసుకొచ్చింది. ఊహించని ఈ పరిణామానికి తీవ్ర భయాందోళనకు గురయ్యారు స్థానికులు. అక్కడినుంచి పరుగులు పెట్టే క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన వారి కళ్లబడింది. కొన్ని క్షణాల క్రితం వారిముందునుంచి దూసుకెళ్లిన రెండు గిరినాగులు రాసలీలల్లో మునిగిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూసి.. ఖంగుతిన్న భక్తులు
ఇప్పుడు వివాహేతర సంబంధం నేరం కాదు.. హైకోర్టు ఏం చెప్తుందంటే ??