Python Viral Video: ఇళ్ల మధ్యలోకి 14 అడుగుల పైథాన్.. జనం హడల్.. వీడియో వైరల్..
ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా కాశీపుర్ తాలుకాలోని గోపిపురా గ్రామంలోకి 14 అడుగుల పొడవున్న కొండ చిలువ ప్రవేశించింది. ఈ పైథాన్‌ను చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు పాములు పట్టే వ్యక్తి తాలిబ్ హుస్సేన్‌ను రప్పించారు.
ఉత్తరాఖండ్‌లో ఓ కొండ చిలువ హల్చల్ చేసింది. పైథాన్ గ్రామంలోకి ప్రవేశించడం వల్ల స్థానికులు ఒక్కసారిగా బెదిరిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా కాశీపుర్ తాలుకాలోని గోపిపురా గ్రామంలోకి 14 అడుగుల పొడవున్న కొండ చిలువ ప్రవేశించింది. ఈ పైథాన్‌ను చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు పాములు పట్టే వ్యక్తి తాలిబ్ హుస్సేన్‌ను రప్పించారు. అతడు చాకచక్యంగా వ్యవహరించి భారీ కొండ చిలువను పట్టుకున్నాడు. అటవీ అధికారుల సమక్షంలో కొండచిలువను అడవిలో వదిలిపెట్టాడు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువ 14 అడుగుల పొడవు.. దాదాపు 74 కిలోల బరువు ఉంటుందని తాలిబ్ చెప్పాడు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలోని గ్రామాల్లో పులులు, సింహాలు, కొండచిలువలు ప్రవేశిస్తున్నాయి. కొన్ని సార్లు కొండచిలువలు గొర్రెలు, మేకలు వంటి మూగజీవులను మింగేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.