AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ఓనం వేళ..‘కుర్చీ మడతబెట్టి’ పాటకు అమ్మాయిల స్టెప్పులు

Trending Video: ఓనం వేళ..‘కుర్చీ మడతబెట్టి’ పాటకు అమ్మాయిల స్టెప్పులు

Ram Naramaneni
|

Updated on: Sep 03, 2025 | 4:52 PM

Share

కేరళలోని ఓనం వేడుకల సందర్భంగా ఒక కాలేజీలో మలయాళి విద్యార్థినులు తెలుగు సినిమా పాట కుర్చీ మడతబెట్టికి డాన్స్ చేసి అలరించారు. సాంప్రదాయ ఓనం నృత్యాలకు భిన్నంగా ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓనం పండుగ వ్యవసాయానికి సంబంధించినది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 5 వరకు పండుగ జరుపుకుంటారు.

కేరళ రాష్ట్రంలో అతి పెద్ద పండుగ ఓనం. ఈ సంవత్సరం ఓనం వేడుకల సందర్భంగా, కేరళలోని ఒక కాలేజీలో వినూత్నమైన ఘట్టం చోటుచేసుకుంది. మలయాళి విద్యార్థినులు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి పాటకు అద్భుతమైన డాన్స్ ప్రదర్శన ఇచ్చారు. సాధారణంగా పులికలి, తిరువాతిరకలి వంటి సంప్రదాయ నృత్యాలతో ఓనం వేడుకలు జరుగుతాయి. అయితే ఈసారి తెలుగు పాటకు వేసిన ఈ నృత్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఓనం పండుగ కేరళ సంస్కృతికి ప్రతీక. వ్యవసాయాన్ని ఆధారం చేసుకున్న ఈ పండుగను పది రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు.

Follow Us