తమిళనాడు అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గిన విజయ్..
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ క్రమంలో మొన్న ప్రజాక్షేత్రంలో గెలిచిన విజయ్.. ఇవాళ అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గాడు. విజయ్ పేరుకు తగినట్లే మరో విజయం సాధించాడు.
తమిళనాడులో రాజకీయ చరిత్రకు కొత్త అధ్యాయం మొదలైంది. ఇటీవల ప్రజాక్షేత్రంలో ఘన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్.. ఇప్పుడు అసెంబ్లీ బలపరీక్షలోనూ తన ఆధిపత్యాన్ని నిరూపించారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా.. వ్యతిరేకంగా కేవలం 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే చీలిక వర్గానికి చెందిన 24 మంది సభ్యులు విజయ్‌కు మద్దతు ఇవ్వడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.
బలపరీక్ష అనంతరం అసెంబ్లీలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “విజయ్ అంటేనే విక్టరీ.. ఆయనపై అందరికీ విశ్వాసం ఉంది.. మానవత్వానికే విజయ్ మారుపేరు” అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రజా నాయకుడిగా వచ్చిన విజయ్.. ఇప్పుడు పరిపాలనలోనూ తన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. “కొత్త చరిత్ర సృష్టించారు” అన్న స్పీకర్ మాటలు తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి సంకేతాలుగా మారాయి.
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..
ఉపాధ్యాయుడి వింత చేష్టలు.. విద్యార్ధి తలపై ఏం చేశాడో చూడండి!
లక్షలాదిమంది మనసు గెలిచిన అమ్మ.. బిడ్డను వీపుపై మోస్తూ..
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?

