వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. కాగా ఇదే సందర్భంగా తన భార్య వితిక నుంచి ఒక ఊహించని గిఫ్ట్ అందుకున్నాడు వరుణ్. అదేంటో తెలుసుకున్న హీరో ఆనందంలో మునిగిపోయాడు. ఇంతకి వితిక ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా? కొత్త ఇల్లు.
వరుణ్ బర్త్ డే సందర్భంగా కొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చింది వితిక. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నాడు. భార్యతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశాడు వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు వరుణ్ వితిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా పడ్డాను అండి ప్రేమలో మరి అనే సినిమా షూటింగ్ లో మొదటిసారి వరుణ్ వితికల పరిచయం మొదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత 2016 ఆగస్టు 19న పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కాగా ఈ జంట పెళ్లి తర్వాత బిగ్ బాస్ మూడో సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. పెళ్లి తర్వాత వితిక సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు టీవీ షో లో మాత్రం కనిపిస్తుంటుంది అందాల తార. ఇక సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది వితిక. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక వరుణ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటున్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
యువకుడి ప్రాణం తీసిన చెప్పు.. అది ఎలా అంటే? వీడియో
పారితోషికం పెంచేసిన జాన్వీ.. పెద్ది’కి ఎంత తీసుకుంటుందో తెలుసా?