Watch Video: వామ్మో.! మూరెడు మల్లెపూల కోసం ఈ మహిళ ఏం చేసిందో చూస్తే దిమ్మతిరుగుద్ది..
చోరీ జరిగిందంటే విలువైన వస్తువులు.. డబ్బు.. నగలు.. లేదంటే ఇంకా ఏదైనా ఖరీదైన పరికరాలు గుర్తుకువస్తాయి. కానీ ఈ చోరీ చూస్తే ముక్కున వేలేసుకుంటారు. చోరీ జరిగిన ఆ సీసీ కెమెరా దృశ్యాలు చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.? పూల దొంగతనం. అదెలా జరిగిందో మీరే చూడండి.
చోరీ జరిగిందంటే విలువైన వస్తువులు.. డబ్బు.. నగలు.. లేదంటే ఇంకా ఏదైనా ఖరీదైన పరికరాలు గుర్తుకువస్తాయి. కానీ ఈ చోరీ చూస్తే ముక్కున వేలేసుకుంటారు. చోరీ జరిగిన ఆ సీసీ కెమెరా దృశ్యాలు చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.? పూల దొంగతనం. అదెలా జరిగిందో మీరే చూడండి. ఈ విచిత్ర చోరీ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఓ వ్యాపారి షాప్‌లో పూజ కోసం పూల వ్యాపారులు ప్రతిరోజూ పూల దండలు, పూలు షాప్ ముందు షటర్‌కు తగిలించి వెళ్లిపోతుంటారు. కట్ చేస్తే.. ప్రతీ రోజూ కవర్ ఉంటుంది కానీ అందులోని పూలు మాత్రం మాయమవుతున్నాయి. దీంతో అనుమానం వచ్చి సీసీ కెమెరాలు పరిశీలిస్తే అసలు కథ బయటపడింది. ఓ గుర్తు తెలియని మహిళ అక్కడ రెక్కీ నిర్వహించి ఈ పూలు మాయం చేస్తోంది. వాటిని తన మెడలో ధరించి మురిసిపోతోంది. సీసీ కెమెరాలలో ఈ విచిత్ర చోరీ సంఘటన చూసిన ప్రతీ ఒక్కరూ నవ్వుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గ్రంథాలయం సమీపంలో ఈ విచిత్ర చోరీ సంఘటన జరిగింది. గ్రంధాలయం ఎదురుగా ఉన్న ప్రకాష్ ఎలక్ట్రికల్స్ షాప్ షట్టర్ వద్ద ఈ పూల చోరీ జరిగింది. పూల దండ వ్యామోహంతో చోరికి పాల్పడుతున్న ఈ విచిత్ర మహిళ ఎవరో ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

