ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు
దేశంలో అత్యధిక వేగంతో వందే భారత్ రైళ్ల నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది కానీ సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు వెళ్లిపోయాయి. నవంబర్ కూడా వచ్చేసింది.
కానీ వందేభారత్ స్లీపర్ రైళ్లు మాత్రం పట్టాలు ఎక్కలేదు. దీనిపై రైల్వే శాఖ సోమవారం స్పందించింది. ఈ రైళ్లు పట్టాలు ఎక్కకపోవడానికి కారణాలను రైల్వే బోర్డు.. అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లకు లేఖల ద్వారా వివరించింది. ఈ రైలులోని డిజైన్లలో సంక్లిష్టతతోపాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల ఈ వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కడంలో ఆలస్యమైందని స్పష్టం చేసింది. చాలా చోట్ల ఫర్నిషింగ్, పనితనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిపింది. బెర్తింగ్ ఏరియాలో పదునైన అంచులు, విండో కర్టెన్ హ్యాండిల్స్, బెర్త్ కనెక్టర్ల మధ్య పాకెట్స్ శుభ్రపరచడం వంటి సమస్యలు.. ఆలస్యానికి కారణాలని వివరించింది. ఈ స్లీపర్ రైళ్లలో ప్రతీ కోచ్ పూర్తిగా ఎయిర్ కండిషన్ ఉండేట్లు ఏర్పాటు చేశారు. విశాలమైన బెడ్‌తోపాటు వాటిపైకి ఎక్కేందుకు మెట్లు కూడా సౌకర్యవంతంగా రూపొందించారు. ఆధునిక ఇంటీరియర్‌లను ఏర్పాటు చేశారు. అలాగే అత్యంత భద్రత ఏర్పాట్లతో ఈ కోచ్‌లను తయారుచేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ఆటోమేటిక్ ఇంటర్ కోచ్ తలుపులను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో.. అంటే 700 నుంచి 1200 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణికుల కోసం ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైళ్లలో ప్రోటో టైప్ 16 కోచ్‌లు ఉంటాయి. 11 ఏసీ 3 ట్రైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటుంది. ఈ రైలులో దాదాపు 1,128 మంది ప్రయాణించేలా సౌకర్యాన్ని కల్పించారు. సీటింగ్, స్లీపింగ్ వసతితోపాటు ప్రయాణికులకు 823 బెర్త్‌లు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లను తొలుత ఢిల్లీ నుంచి అహ్మదాబాద్, భోపాల్, పాట్నా మధ్య నడపనున్నారు. దీని వల్ల దాదాపు 1000 కిలోమీటర్ల మేర ప్రయాణానికి పట్టే సమయం బాగా తగ్గనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేను ఐఏఎస్‌ను.. ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా వచ్చాను
ఆమె అప్పుడు హైదరాబాదీ.. ఇప్పుడు అమెరికాలో వర్జీనియా గవర్నర్
రియల్ ఎస్టేట్‌లో నయా ట్రెండ్.. పోతే రూ.వెయ్యి.. వస్తే ఇల్లు
