త్వరలో వందే భారత్ 4.0.. గంటకు 320 కి.మీ స్పీడ్‌

Updated on: Oct 18, 2025 | 5:49 PM

పాత బడిన డొక్కు రైల్వే బోగీలు, తక్కువ కెపాసిటీ ఇంజన్లతో నెమ్మదిగా నడిచే రైళ్ల స్థానంలో భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోంది. దీంతో మరిన్ని కొత్త మార్గాల్లో ఈ స్పెషల్ రైళ్లు ప్రవేశపెట్టడంతో పాటు స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మరో సంచలన ప్రకటన చేశారు.

త్వరలో వందే భారత్ 4.0ను అభివృద్ధి చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. వరల్డ్ క్లాస్ ప్రమాణాలను చేరుకునే లక్ష్యంతో దేశంలోని అన్ని కేటగిరీల రైళ్ళనూ పూర్తిగా రీ డిజైన్‌ చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న వందే భారత్ 3.0 వెర్షన్‌ స్థానంలో వందేభారత్ 4.0ను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడున్న వందే భారత్ సర్వీసులను పూర్తిగా రీడిజైన్ చేసి.. ప్రపంచంలోని అత్యుత్తమ రైళ్లతో పోటీపడే విధంగా కొత్త టెక్నాలజీని అందించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వివరించారు. అప్‌గ్రేడ్ చేసే వందే భారత్ 4.0 రైళ్లలో మెరుగైన టాయిలెట్లు, మెరుగైన సీటింగ్ , మెరుగైన కోచ్ లు ఉంటాయని రైల్వే మంత్రి తెలిపారు. రాబోయే 18 నెలల్లో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వందే భారత్ 3.0.. జపాన్, యూరోప్ రైళ్లతో పోటీ పడుతోందని, కేవలం 52 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకోవటమే గాక తక్కువ శబ్దం, కంపనాన్ని ఉత్పత్తి చేస్తుందని వివరించారు. వందే భారత్ 4.0ను రాబోయే ఐదేళ్లలో గంటకు 320 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా రెడీ చేయటంతో బాటు కవచ్ 5.0 సెక్యూరిటీ సిస్టమ్‌ను కూడా అందిస్తామన్నారు. దేశీయంగా వాడుకోవటంతో బాటు విదేశాలకు కూడా ఈ కొత్త రైళ్ల ఎగుమతికి ప్లానింగ్ రెడీగా ఉందని మంత్రి వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2026లో అంతా విధ్వంసమే బాబా వంగా సరికొత్త జోస్యం

చేయని హత్యకు 43 ఏళ్లు జైలు..రిలీజయ్యాక కొత్త కష్టాలు

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసుకుంటున్నారా ?? ఈ స్టోరీ చూడాల్సిందే

దీపావళి తరువాత వెండి ధర పెరుగుతుందా? తగ్గుతుందా?

ఉపరితల ఆవర్తనంతో ఏపీ,తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు