వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు !!
టీ పొడితో మనం టీని తయారు చేసుకొని తాగడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ టీపొడితో మీ అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చని తెలుసా? అవును, టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ముఖానికి రాసినప్పుడు స్కిన్ టోన్ మెరుగవుతుంది. అంతేకాదు, చర్మంపై ముడతలు తగ్గి అందంగా కనిపిస్తుంది.
టీ పొడితో మనం టీని తయారు చేసుకొని తాగడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ టీపొడితో మీ అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చని తెలుసా? అవును, టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ముఖానికి రాసినప్పుడు స్కిన్ టోన్ మెరుగవుతుంది. అంతేకాదు, చర్మంపై ముడతలు తగ్గి అందంగా కనిపిస్తుంది. ఇందుకోసం తాజా టీ పొడి అవసరం లేదు. వాడిన టీ పొడిని కూడా వాడొచ్చు. టీ చేసుకున్న తర్వాత దీనిని ఫిల్టర్ చేసి పడేయకుండా పక్కన స్టోర్ చేసుకుంటే సరి. ఓ చెంచా అలోవెరా జెల్ తీసుకొని, దానిలో ఓ చెంచా టీపొడి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత మసాజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీనిని వాడడం వల్ల ముఖంపైన ఉండే పెద్ద రంధ్రాలు, ముడతలు, ఫైన్‌లైన్స్ తగ్గుతాయి. అంతేకాదు, వృద్ధాప్య లక్షణాలు దూరమై యవ్వనంగా కనిపిస్తారు. ప్రతి రోజూ టీ చేశాక ఆ టీ పౌడర్‌ని పారేయొద్దు.. దీనిని చల్లార్చి గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. దీనిని స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా బాడీ వాష్ వాడే ముందు ఈ టీ పౌడర్‌ని ప్రతిరోజూ అప్లై చేసి స్క్రబ్‌లా రాయాలి. ఆ తర్వాత సబ్బుతో క్లీన్ చేయాలి. ఇలా చేయడం ద్వారా, డబుల్ క్లెన్సింగ్‌తో శరీరం పూర్తిగా క్లీన్ అవుతుంది. దీంతో చనిపోయిన చర్మ కణాలు కూడా ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. చర్మం మెరుస్తుంది. రక్తప్రసరణ కూడా పెరుగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ యాప్‌లోనూ టికెట్ బుక్ చేసుకోవచ్చు
బాదం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ?? నిపుణులు ఏమంటున్నారు ??
‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్
ఇష్టం లేని కాపురం వాళ్లది !! రాజ్ తరుణ్ ఇష్యూపై సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్
OTTలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న అంజలి ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్