మైండ్‌ఫుల్‌నెస్‌ గురించి విన్నారా? ప్రాక్టీస్ చేస్తే సూపర్ రిజల్ట్

Updated on: Feb 10, 2025 | 5:41 PM

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వెల్నెస్ ట్రెండ్ మైండ్‌ఫుల్‌నెస్. దీనివల్ల లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. శ్వాస మీద దృష్టి కేంద్రీకరించి అవయవాలూ, ఆలోచనల మీద కంట్రోల్ సాధించడమే మైండ్‌ఫుల్‌నెస్. మన పరిస్థితులు, చేసే పనుల ఫలితం ఎలాంటిదైనా స్వీకరించి ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తు మీద అవగాహనతో జీవించడం కూడా మైండ్‌ఫుల్‌నెస్‌లో భాగమే.

మైండ్‌ఫుల్‌నెస్‌ని సాధన చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అనవసరపు మానసిక సమస్యలకు తావుండదు. మెదడు చురుగ్గా, ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడటంతోపాటు అల్జీమర్స్‌ను తగ్గిస్తుంది. ఇక ఈ మైండ్‌ఫుల్‌నెస్ జీవనశైలి కారణంగా పూర్తి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ప్రశాంతంగా, పాజిటివ్ లుక్‌లో కనిపిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుటం తేలికవుతుంది. చుట్టూ ఉండే పరిస్థితుల మీద పట్టు సాధించగలుగుతారు. మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌తో చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా చేసే పనిలో సక్సెస్ రేటు పెరుగుతుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అనవసరంగా కంగారుపడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తూ సమస్యను అధిగమించగలుగుతారు. ఒత్తిడితో వచ్చే మైగ్రేన్, కంటి సమస్యలు, మెడనొప్పి వంటివన్నీ అదుపులోకి వస్తాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. బంధాలకు, బంధుత్వాలకు విలువ ఇవ్వటంతోపాటు సానుకూల ధోరణిలో ఆలోచించడం కూడా ఈ వెల్నెస్ ట్రెండ్‌లో భాగమే.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచి హోటల్‌, నోరూరించే మెనూ.. లోపల కిచెన్‌లోకి వెళ్తే

త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థితో పెళ్లి ఘటన.. లేడీ ప్రొఫెస‌ర్ కీల‌క నిర్ణయం

బాయ్‌ ఫ్రెండ్‌ కోసం ఇద్దరు అమ్మాయిల సిగపట్లు

‘ఉప్మా వద్దు.. చికెన్‌ ఫ్రై, బిర్యానీ కావాలి’

ఆస్తి పంపకాల్లాగే అంత్యక్రియల పంపకం.. తండ్రి మృతదేహాన్ని