Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో మరో అపచారం
బాసర పవిత్ర పుణ్యక్షేత్రం. దసరా సందర్భంగా బాసరకు భక్తులు పోటెత్తారు. ఐతే మూలానక్షత్రం కోసం తయారు చేసిన లడ్డూలకు బూజు పట్టిన వైనం సంచలనం రేపింది.రద్దీ దృష్ట్యా ముందస్తుగానే ఆలయ కమిటీ పెద్ద సంఖ్యలో లడ్డూలను తయారు చేయించారు. పండగ రోజే పచ్చినిజం తెరపైకి వచ్చింది. వంద రూపాయిల చొప్పున విక్రయించే సరస్వతి దేవి అభిషేకం లడ్డూకు ఫంగస్ సోకింది. ఆ నిజాన్ని కవర్ చేసేందుకు ఫంగస్ సోకిన లడ్డూలను గప్‌చుప్‌గా మాయం చేసే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
బాసర పవిత్ర పుణ్యక్షేత్రం. దసరా సందర్భంగా బాసరకు భక్తులు పోటెత్తారు. ఐతే మూలానక్షత్రం కోసం తయారు చేసిన లడ్డూలకు బూజు పట్టిన వైనం సంచలనం రేపింది.రద్దీ దృష్ట్యా ముందస్తుగానే ఆలయ కమిటీ పెద్ద సంఖ్యలో లడ్డూలను తయారు చేయించారు. పండగ రోజే పచ్చినిజం తెరపైకి వచ్చింది. వంద రూపాయిల చొప్పున విక్రయించే సరస్వతి దేవి అభిషేకం లడ్డూకు ఫంగస్ సోకింది. ఆ నిజాన్ని కవర్ చేసేందుకు ఫంగస్ సోకిన లడ్డూలను గప్‌చుప్‌గా మాయం చేసే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు సిబ్బంది కొన్ని లడ్డులను వాగులో పడేశారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. పాడైన లడ్డూలను ఆరబెట్టారు సిబ్బంది. ఆ దృశ్యం కొందరు భక్తుల కంటపడింది. ఏంటని ఆరా తీస్తే మాట దాటేసే ప్రయత్నం చేశారు సిబ్బంది. కూపీలాగితే లడ్డూలకు ఫంగస్ సోకిన ముచ్చట బయటపడింది. వందో రెండోందలో కాదు ఏకంగా వేల సంఖ్యలు లడ్డూలకు ఫంగస్ సోకింది. ఒక్కో లడ్డూ ఖరీదు వంద రూపాయిలు. ఈ లెక్కన ఎటూలేదన్న దేవస్థానానికి భారీ నష్టం. ఇదంతా ఎవరి నిర్లక్ష్యం వల్ల? నిజం నిలకడ మీద తేలకమానదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gaza–Israel conflict: చిన్నారులే సమిధలా ?? గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒకరు మృతి
టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే కనిపించని భార్య
Chiranjeevi: బాల్య మిత్రుడికి చిరంజీవి సపోర్ట్.. ఫొటోలు వైరల్
హమాస్ దగ్గర రసాయన ఆయుధాలు ఉన్నాయా ?? ఇజ్రాయిల్ వి ఆరోపణలా ?? నిజాలా ??