ఆపరేషన్ మధ్యలో వదిలేసి ఇదేం పాడుపని డాక్టరూ వీడియో
దేవుడు తర్వాత ప్రజలు చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్‌కే. ఎందుకంటే భగవంతుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాన్ని నిలబెట్టగలిగే శక్తి ఉన్నవాడు వైద్యుడు. అంతటి పవిత్రమైన వృత్తికే మచ్చతెచ్చేపనులు చేస్తుంటారు కొందరు. అలాంటి ఘటన పాకిస్తాన్‌లో జరిగింది. ఓ డాక్టర్ ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి నర్స్‌తో శృంగారంలో పాల్గొన్నాడు. ఈ దారుణమైన ఘటన గ్రేటర్ మాంచెస్టర్‌లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
పాకిస్థాన్‌కు చెందిన డాక్టర్ సుహైల్ అంజుమ్ ఓ ఆసుపత్రిలో కన్సల్టెంట్ అనస్థటిస్ట్‌గా పనిచేస్తున్నారు. 2023 సెప్టెంబర్ 16న ఒక రోగికి గాల్‌బ్లాడర్ సర్జరీలో భాగంగా.. సుహైల్ పేషంట్‌కు అనస్థీషియా ఇచ్చారు. ఆ తర్వాత ఆ రోగికి ఆపరేషన్ జరుగుతుండగా మత్తు ఇచ్చిన వైద్యుడు మధ్యలోనే వదిలేసి పక్కనే ఉన్న మరో ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లారు. అక్కడ నర్స్ తో ఆయన అనుచిత స్థితిలో ఉండగా, మరో సహోద్యోగి నర్స్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. కొన్ని నిమిషాల తర్వాత డాక్టర్ అంజుమ్ తిరిగి వచ్చి శస్త్రచికిత్సలో పాల్గొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన వైద్య ట్రైబ్యునల్ ముందు డాక్టర్ అంజుమ్ తన తప్పును అంగీకరిస్తూ…ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం. దీనికి పూర్తి బాధ్యుడిని నేనే. రోగిని, నా సహోద్యోగులను, ఆసుపత్రి నమ్మకాన్ని వమ్ము చేశాను..క్షమించండి అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. డాక్టర్ ఆ సమయంలో తన ప్రవర్తనకు గల కారణాన్ని వివరిస్తూ.. తన కుమార్తె నెలలు నిండకుండా పుట్టడం, వైవాహిక జీవితంలోని తీవ్రమైన ఒత్తిడి కారణంగానే తాను ఆ క్షణంలో అలా ప్రవర్తించానని వివరణ ఇచ్చారు. ఆ విషయం గుర్తుకొచ్చిన ప్రతీసారి తన గుండె ముక్కలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన వృత్తి అంటే తనకు ప్రాణమని, కానీ ఆ సమయంలో అలా ఎలా జరిగిందో అర్థం కాలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన తర్వాత 2024 ఫిబ్రవరిలో ఉద్యోగం మానేసి పాకిస్థాన్‌కు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తనను క్షమించి యూకేలో మళ్లీ వైద్య వృత్తిని కొనసాగించేందుకు ఒక అవకాశం ఇవ్వాలని ట్రైబ్యునల్‌ను వేడుకున్నారు. ఈ సంఘటన తన జీవితంలో జరిగిన ఒకే ఒక తప్పిదమని, భవిష్యత్తులో పునరావృతం కాదని హామీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో
టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో
153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో
