త్వరలో ఆధార్ యాప్ ఇక.. ఆధార్ సెంటర్లకు బై బై

Updated on: Sep 02, 2025 | 1:35 PM

ఆధార్ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్​. త్వరలోనే ఏఐ, ఫేస్​ ఐడీ ఫీచర్లతో కొత్త 'ఈ-ఆధార్​ యాప్​'ను లాంఛ్ చేసేందుకు యూఐడీఏఐ సిద్ధమవుతోంది. ఇది అందుబాటులోకి వస్తే మీ మొబైల్​లోనే మీరు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్​ అప్డేట్ చేసుకోవడం వీలవుతుంది. ప్రస్తుతం ఎవరైనా తమ ఆధార్​ వివరాలను అప్డేట్ చేయాలంటే, కచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లక తప్పని పరిస్థితి.

దీని వల్ల చాలా సమయం, డబ్బు వృథా అవుతోంది. చిన్న అప్డేట్ చేయాలన్నా ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఉద్యోగులైతే.. ఒక రోజు సెలవు పెట్టాల్సి వస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ఇంటర్నెట్ లేని చోట్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ.. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ-ఆధార్​ మొబైల్ యాప్ ​ను అభివృద్ధి చేస్తోంది. కొత్త యాప్​ వచ్చిన తర్వాత కూడా వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి వాటిని అప్‌డేట్ చేయాలంటే మాత్రం కచ్చితంగా వ్యక్తిగతంగా ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూఐడీఏఐ ‘బయోమెట్రిక్​ అప్డేట్’ గడువును 2025 నవంబర్​ వరకు పొడిగించింది. ఏఐ, ఫేస్ ఐడీ ఫీచర్లతో కొత్త ‘ఈ-ఆధార్ యాప్’​ను తీసుకువస్తున్నారు. కనుక ఆధార్​ వివరాల అప్డేట్​ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. పైగా ఇది సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలంటే పాస్​వర్డులు, ఓటీపీలు ఎంటర్ చేయాల్సి వస్తోంది. కానీ కొత్త యాప్​ అందుబాటులోకి వస్తే ఫేస్​ ఐడీతో నేరుగా లాగిన్ అయి.. నేరుగా వివరాలు అప్డేట్ చేయవచ్చు. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత వివరాల చోరీకి, మోసాలకు అవకాశం తగ్గుతుంది. కొత్త యాప్ వచ్చిన తరువాత ఆటోమేటిక్​ గా.. వెరిఫికేషన్ పూర్తి అయిపోతుంది. ఎలా అంటే? యూజర్​ తన ఆధార్​ చిరునామా వివరాలు సమర్పిస్తే, యూఐడీఏఐ వద్ద ఉన్న ప్రభుత్వ డేటాబేస్ ఆధారంగా.. ఆ వివరాలు సరైనవో, కావో క్రాస్​-వెరిఫికేషన్ జరిగిపోతుంది. అంటే మీ పాన్​ డేటాబేస్​, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్​ రిజిస్ట్రీ సహా ఇతర వివరాలను ఆటోమేటిక్ ​గా వెరిఫై చేస్తుంది. దీనితో పాటు మీ చిరునామా నిర్ధారణ చేయడానికి, మీ విద్యుత్​ బిల్లులు వంటి వాటిని కూడా తనిఖీ చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టెర్రస్ పై నుంచి దూకబోయిన ‘నీట్’ విద్యార్థిని.. చివరి నిమిషంలో

Rainfall Warning: మరో అల్పపీడనం.. వచ్చే 3 రోజులు వానలే వానలు

గుళ్లలో హుండీలను 10 సార్లు చోరీ చేసిన హెచ్‌ఐవీ పాజిటివ్‌ వ్యక్తి .. దేవుడిపై కోపంతోనే !

అదే జరిగితే.. అమెరికా కొంప మునిగినట్లే

Vishal: పెళ్లికి ముందే సంచలన నిర్ణయం తీసుకున్న హీరో విశాల్‌