భారత్‌కు టైఫూన్‌ ‘డాల్ఫిన్’ దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!

Updated on: Aug 12, 2026 | 1:17 PM

చైనా తూర్పు తీరాన్ని గడగడలాడించిన టైఫూన్ డాల్ఫిన్ భారత రుతుపవనాలపై పరోక్ష ప్రభావాన్ని చూపుతోంది. ఈ టైఫూన్ వల్ల దేశానికి ప్రత్యక్ష ముప్పు లేకున్నా, పసిఫిక్ సముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణులు ఏర్పడకుండా అడ్డుకుంటున్నాయి. దీంతో మన వర్షపాతం బలహీనపడుతోందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

టైఫూన్ డాల్ఫిన్ చైనా తూర్పు తీరాన్ని గడగడలాడించింది. ఆగస్టు 9న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని యుహ్వాన్ సమీపంలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులతో ఈ టైఫూన్ తీరాన్ని దాటింది. చైనాలో ఇది ఈ ఏడాది వచ్చిన అత్యంత శక్తివంతమైన టైఫూన్‌గా గుర్తించబడింది. దీని ధాటికి చైనా ప్రభుత్వం సుమారు పది లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది.ఈ టైఫూన్ వల్ల భారత్‌కు ప్రత్యక్షంగా ఎలాంటి ముప్పు లేనప్పటికీ, ఇది భారత రుతుపవనాలపై పరోక్షంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో తరహా పరిస్థితులు నెలకొనడంతో వాతావరణ కదలికలు తూర్పు వైపునకు మళ్లుతున్నాయి. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలోని గాలి ప్రవాహాలను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా, భారత రుతుపవనాలకు కీలకమైన బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడన ద్రోణులు ఏర్పడడం లేదు. దీనివల్ల దేశంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితేనే రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటాయని నిపుణులు స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే..

రాకింగ్ స్టార్ యశ్ మాస్టర్ ప్లాన్

మహేష్‌ ఫ్యాన్స్‌ను మోసం చేసిన రాజమౌళి!

అవతార్‌ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?

 

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us