Vande Bharat: విశాఖకు కొత్తగా 2 వందే భారత్‌ రైళ్లు..

|

Mar 14, 2024 | 12:33 PM

రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్చువల్ విధానంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నారు. విశాఖకు కొత్తగా రెండు వందే భారత్‌ రైళ్లు రానున్నాయి. సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్‌, పూరీ-విశాఖ రైళ్లను మార్చి 12న ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్‌ రైలు నం.20707/20708 మార్చి 12న ప్రారంభమైంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ

రేపు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్చువల్ విధానంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించబోతున్నారు. విశాఖకు కొత్తగా రెండు వందే భారత్‌ రైళ్లు రానున్నాయి. సికింద్రాబాద్‌-విశాఖ-సికింద్రాబాద్‌, పూరీ-విశాఖ రైళ్లను మార్చి 12న ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్‌ రైలు నం.20707/20708 మార్చి 12న ప్రారంభమైంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు గురువారం మినహా మిగతా రోజుల్లో సర్వీసులందించనుంది. రెగ్యులర్‌ సర్వీసులు మార్చి 13 నుంచి ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌- విశాఖపట్నం వందే భారత్‌ రైలు 20707 ఉదయం 5.05గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35గంటలకు బయల్దేరే 20708 నెంబర్‌ రైలు రాత్రి 11.20గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

1200 ఏళ్లనాటి సమాధిలో బంగారం నిధి..

Poonam Kaur: గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్‌..

‘ఫ్రెండ్స్‌తో గడపాలని నా భర్త ఒత్తిడి చేశాడు’ స్టార్ హీరోయిన్ ఆవేదన

HanuMan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో హనుమాన్ టీం..

Thalapathy Vijay: దళపతి కోటి రూపాయల విరాళం.. విశాల్ ఎమోషనల్