Hyderabad: చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన రెండు జెనరేటర్ వెహికిల్‌లు.. నెంబర్ ప్లేట్‌లు చూడగా

Updated on: Sep 16, 2025 | 2:02 PM

ఖైరతాబాద్ పోలీసులు.. సాధారణ తనిఖీలు చేపట్టారు. వాళ్లకు రెండు వాహనాలు కొంచెం తేడాగా కనిపించాయి. క్షుణ్ణంగా పరిశీలించగా.. వాటి నెంబర్ ప్లేట్స్ చూసి దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఏంటి.? ఈ స్టోరీలో చూసేయండి మరి. ఓ సారి లుక్కేయండి.

ఒకే నెంబర్‌తో నడుస్తున్న రెండు జెనరేటర్ వెహికిల్‌లను సీజ్ చేశారు ఖైరతాబాద్ రవాణా శాఖ అధికారులు. AP 28 BU 7316 నెంబర్‌తో వాహనాల సర్టిఫికెట్‌లు క్రియేట్ చేసి టాక్స్ ఎగవేసి తిరుగుతున్న రెండు వాహనాలను ఖైరతాబాద్ రవాణా శాఖ అధికారులు గుర్తించారు. అసలైన నెంబర్ గల వాహనం ఇంకా ఆచూకీ తెలియదు. సీజ్ చేసిన వాహనాల యజమానికి విషయం తెలిపామని.. తాను కరెక్ట్‌గానే ఉన్నానని.. మీరే సరిగ్గా లేరని వాగ్వాదం చేస్తున్నట్టు అధికారులు అన్నారు. ఇలాంటి ఒకే నెంబర్‌తో రెండు, మూడు వాహనాలు తిరుగుతున్నట్టు గుర్తిస్తే రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

Published on: Sep 16, 2025 02:00 PM