TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే
టీటీడీ భక్తులకు కీలక సూచన చేసింది. దర్శనం, వసతి టికెట్ల కోసం నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. టీటీడీ చిహ్నాలను వాడుతూ మోసగాళ్లు ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేస్తున్నారు. టీటీడీ ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. భక్తులు కేవలం ttdevasthanams.ap.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు స్పష్టం చేశారు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. దర్శన టికెట్లు, వసతి గదుల పేరుతో సోషల్ మీడియా, గూగుల్‌లో చెలరేగిపోతున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేరళకు చెందిన సి.కె.సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో గదులు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి మోసపోయాడు. ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. టీటీడీ అధికారిక చిహ్నాలు, శ్రీవారి ఆలయ చిత్రాలను వాడుకుంటూ కొన్ని ముఠాలు నకిలీ వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గూగుల్ సెర్చ్‌లో ఇవి కనిపిస్తూ భక్తుల నుంచి ఆన్‌లైన్ పేమెంట్ల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నకిలీ వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఐటీ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనధికారికంగా ఆలయ చిత్రాలను వాడుతున్న వారిపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే, భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారానే భక్తులు స్వామివారి దర్శనం టికెట్లు, వసతి గదులు, శ్రీవారి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వెబ్‌సైట్లు లేదా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది. దళారులను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
వామ్మో పెద్దపులి.. వణుకుతున్న మన్యం
అర్ధరాత్రి లాడ్జిలో మంటలు.. 33 మంది..
