ట్రాఫిక్ చలాన్ల బలవంతపు వసూళ్లకు చెక్.. హైకోర్ట్ కీలక ఆదేశాలు
తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాలను ఆపి, తాళాలు లాక్కొని, అక్కడికక్కడే డబ్బులు చెల్లించాలని బలవంతం చేయరాదని స్పష్టం చేసింది. ఇకపై వాహనదారులు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే స్వీకరించాలి లేదా నోటీసులు ఇవ్వాలని సూచించింది. బలవంతపు వసూళ్లకు చెక్ పెడుతూ, చట్ట ప్రకారం మాత్రమే వ్యవహరించాలని కోర్టు ఆదేశించడంతో డ్రైవర్లకు ఊరట లభించింది.
పెండింగ్ చలాన్లు ఉన్నాయని పోలీసులు ఆపుతున్నారా? బండి తాళాలు లాక్కొని ఇప్పుడే కట్టాలని ఒత్తిడి చేస్తున్నారా? అయితే ఇకపై ఈ విధానం ఉండదు. బలవంతపు వసూళ్లకు చెక్ పెడుతూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ల వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్లు కట్టాల్సిందేనని రోడ్లపై బలవంతం పెట్టోద్దని సూచించింది. పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల తాళాలు లాక్కోవడం, వాహనం ఆపి అక్కడికక్కడే డబ్బులు చెల్లించాలని వాహనదారులను ఒత్తిడి చేయొద్దని ఆదేశించింది. ఒకవేళ పెండింగ్‍లో ఉన్న చలాన్ల వసూలు చేయాలని పోలీసులు భావిస్తే.. చట్టం ప్రకారం మాత్రమే వెళ్లాలని తెలిపింది. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే తీసుకోవాలని… లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల అమలు కోసం ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న విధానాలను సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు అయ్యింది. ట్రాఫిక్ అమలు కోసం అనధికార మొబైల్ పరికరాల వినియోగాన్ని కూడా పిటిషనర్ సవాలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్.. కేవలం పెండింగ్ చలాన్లు వసూలు చేయడం కోసమే వాహనదారులను ఆపడాన్ని కోర్టు తప్పుబట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
Prabhas: ఇండియాలో నెంబర్ 1 స్టార్ మనోడే !!
Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది
CM రిక్వెస్ట్ తో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్లిన మెగాస్టార్
