ఆర్జీకర్‌ వైద్యురాలి మృతదేహంపై మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు..! ఆమె ఎవరు?

Updated on: Jan 22, 2025 | 5:40 PM

ఆర్జీకర్‌ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించగా.. తాజాగా మృతురాలి పోస్ట్‌ మార్టం రిపోర్టులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి ఫోరెన్సిక్‌ రిపోర్టులో నిందితుడు సంజయ్‌రాయ్‌ డిఎన్‌ఏతోపాటు..మరో మహిళ డిఎన్‌ఏను గుర్తించారు.  విచారణలో భాగంగా సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ లాబొరేటరీ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో మృతురాలి శరీరంపై ఓ మహిళ డీఎన్ఏ లభించినట్లు పేర్కొంది.

జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్‌రాయ్‌ డీఎన్ఏ 100 శాతం మృతురాలి శరీరంపై కనుగొన్నారు. అదేవిధంగా అతికొద్ది స్థాయిలో ఓ మహిళ డీఎన్ఏ సైతం బయటపడింది. అయితే, అది పొరపాటున ఈ డీఎన్‌ఏతో కలిసిందా లేక సదరు మహిళ కూడా నేరంలో భాగమైందా అనే విషయం తేలాల్సి ఉంది. విచారణలో భాగంగా జూనియర్ వైద్యురాలి శవపరీక్ష వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి…‘‘పోస్టుమార్టం కోసం ఉపయోగించిన వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో స్టెరిలైజ్ చేయలేదని ఈ వీడియోను చూస్తే అర్థమవుతోంది. తగిన సదుపాయాలు లేనికారణంగా వైద్య సిబ్బంది తగిన ప్రొటోకాల్ పాటించలేదని తెలుస్తోంది. కానీ తప్పనిసరి పరిస్థితిలో వారు ఈ విధుల్ని నిర్వర్తించడం మినహా మరో మార్గం లేదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ నేరంలో మరికొందరి ప్రమేయం ఉందని జూనియర్‌ వైద్యురాలి తండ్రి గతంలో ఆరోపణలు చేశారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా స్వాబ్‌ సేకరించలేదని.. కేసు ఛేదించడానికి సీబీఐ ఎక్కువగా ప్రయత్నించడం లేదన్నారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా డీఎన్‌ఏ రిపోర్టులో వెల్లడైందని అధికారులు తనకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. అన్నప్రసాదంలో ఇకపై కొత్త ఐటమ్

Trump – Putin: పుతిన్‌కు మొదటి రోజే షాకిచ్చిన ట్రంప్‌

కశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు.. ఏపీ జవాన్ మృ*తి

TOP 9 ET News: రూ.60 కోట్లు పెడితే.. ఇప్పటి వరకు రూ.175 కోట్ల రాబడి

అమెరికాలో పెట్టేబేడా సర్దుకుంటున్న.. అక్రమంగా ఉంటున్న ప్రవాసులు!