రోజూ సపోటా తింటే శరీరంలో అద్భుతమే చేస్తుంది

Updated on: Jun 16, 2025 | 9:10 PM

పండ్లు ఏవైనా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్కో పండు ఒక్కోరకమైన ఫలితాలనిస్తుంది. ఇందులో సపోటా ఒకటి. రోజూ సపోటా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనిస్తుందంటున్నారు నిపుణులు. సపోటా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. సపోటా పండ్లలోని విటమిన్ ఎ, సి కంటికి మేలు చేస్తాయి.

శరీరంలోని విష వ్యర్థాలను తొలగించి గుండెను రక్షించడంలో ఇది మేలు చేస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. సపోటాలో ఫైబర్, విటమిన్ బితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తాయి. సపోటాలలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. పని చేసి అలసిపోయిన వారు ఈ పండ్లను తింటే ఫుల్ ఎనర్జీ వస్తుంది. సపోటా రెగ్యులర్‌గా తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సపోటా స్ట్రెస్‌ను కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. సపోటాలో వుండే యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు వాపు- నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. సపోటాలో ఉండే విటమిన్ ఎ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి. సపోటా నేరుగా తినవచ్చు లేదా జ్యూస్‌ కూడా తీసుకోవచ్చు. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు సపోటాలో ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. రోజూ సపోటా తింటే వృద్ధాప్యంలో ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సపోటాలలోని ఫోలేట్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం ఎముకలను దృఢపరుస్తుంది. గర్భిణీ స్త్రీలు ఉదయాన్నే సపోటా తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్‌ తెరిచిన డ్రైవర్‌.. ఏం జరిగిందంటే

టాటూ వేయించుకున్న సురేఖా వాణి.. విషయం తెలియకుండా తప్పుబడుతున్న నెటిజన్స్‌

బాలీవుడ్‌ రామాయణలో శూర్పణఖగా టాలీవుడ్ స్టార్ హీరోయన్ ??

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా..?

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్