అతిగా ఉప్పు తీసుకుంటున్నారా? హార్ట్ ఎటాక్ ముప్పు తప్పదా

Updated on: Aug 12, 2025 | 8:00 PM

తెలియకుండానే చాలా మంది ఉప్పుకు అడిక్ట్ అయిపోతుంటారు. వంటల్లో రుచి కోసమని అతిగా ఉప్పు తీసుకుంటున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. WHO నివేదిక ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు. కానీ దీని కంటే ఎక్కువ మొతాదులో ఉప్పు తీసుకోవడం వలన ఇది అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, మూత్రపిండాల సమస్యలను తీసుకొస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.

శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వలన ఇది శరీరాన్ని తెలియకుండానే తినేస్తుంది. అధిక ఉప్పు అనేది శరీరంలో సోడియం మోతాదును విపరీతంగా పెంచుతుంది. దీని వలన రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది. వీలైనంత వరకు చాలా తక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది తమకు తెలియకుండానే,10 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. బయటి ఫుడ్, పాపడ్, పకోడి, ఫర్సాన్, స్నాక్స్, చిప్స్ వంటి వాటిల్లో అధిక ఉప్పు ఉంటుంది. కానీ చాలా మంది తమకు తెలియకుండా వీటిని తిని శరీరంలో సోడియాన్ని పెంచుకుంటున్నారు. దీని వలన మూత్ర పిండాల పనితీరు బలహీనపడటం, దృష్టి సమస్యలు, గుండె నాళాల పొడవు తగ్గడం, ఒంట్లో వాపులు, శరీంలో నీటి నిల్వ పెరగడం, జీర్ణ సమస్యలు, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయట. పైకి చూస్తే వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ ఇది లోలోపల మాత్రం ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువకే వీలైనంత వరకు ఉప్పును తగ్గించుకోవాలని చెబుతున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే అతిగా ఉప్పు తీసుకోవడం వలన ఇది గుండె జబ్బుల సమస్యను పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవుడ్ని మొక్కేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్

ముఖ్యమంత్రి పేరును మర్చిపోయా క్షమించండి..

అభిమాని మూగ అభిమానం.. కరిగిపోయి కోరిక తీర్చిన NTR

అడ్వాన్స్ బుకింగ్స్‏లో వార్ 2 ఆల్ టైమ్ రికార్డ్..

జపాన్‌ లోకల్ ట్రైన్‌లో NTR క్రేజ్‌.. అవాక్కవుతున్న ఇండియన్స్‌