AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాన్స్ బేబీ డాన్స్..ఆ నలుగురు సమ్‌థింగ్ స్పెషల్!

డాన్స్ బేబీ డాన్స్..ఆ నలుగురు సమ్‌థింగ్ స్పెషల్!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 16, 2026 | 1:39 PM

Share

డాన్స్‌ అంటే హీరోలే గుర్తొచ్చినా టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు తమ స్టెప్పులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సాయి పల్లవి, శ్రీలీల, మమితా బైజు ఇప్పటికే డాన్స్‌లో తమదైన ముద్ర వేశారు. తాజాగా ఫోక్‌ సాంగ్స్‌ నుంచి వచ్చిన నాగదుర్గ కూడా ఈ జాబితాలో చేరుతున్నారని కథనం చెబుతోంది. ‘ఇడుపు కాయితం’లోని ‘శ్రీలత’ పాటలో ఆమె వేసిన స్టెప్పులు వైరల్‌ అవుతున్నాయి. ఈ నలుగురి ఈజ్‌, స్టైల్‌ డాన్స్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

డాన్స్ అంటే మనకి హీరోలే గుర్తుకొస్తుంటారు కానీ ఈ మధ్య కొందరు హీరోయిన్లు డాన్సుల్లో ఇరగదీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కేవలం డాన్సులతోనే వాళ్ల రేంజ్ అమాంతం పెరుగుతుంది. నటన వాళ్లకు బోనస్ కిందలెక్క. టాలీవుడ్‌లో ముగ్గురు హీరోయిన్లు డాన్సుల్లో టాప్ లేపేస్తున్నారిప్పుడు. వాళ్లకు పోటీగా మరో బ్యూటీ జాయిన్ అయిపోయింది. మరి ఆమెవరు..? అసలు డాన్సింగ్ క్వీన్స్ ఎవరో చూద్దామా..? డాన్సులు అంటే మామూలుగా హీరోల పేర్లే ఎక్కువగా చెప్తుంటారు కానీ హీరోయిన్లలో కూడా ప్రో డాన్సర్స్ ఉన్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా సాయి పల్లవి, శ్రీలీల లాంటి వాళ్లైతే ప్రో మ్యాక్స్ అంతే..! వీళ్ళకు తోడు నాగదుర్గ జాయిన్ అయిపోయారిప్పుడు. ఫోక్ సాంగ్స్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. హీరోయిన్‌గా బిజీ అవ్వాలని చూస్తున్నారు. తాజాగా ప్రియదర్శి హీరోగా బన్నీ వాస్ నిర్మిస్తున్న ఇడుపు కాయితం నుంచి శ్రీలత అంటూ సాగే సాంగ్ వచ్చింది. ఇందులో నాగదుర్గ స్టెప్స్ వైరల్ అవుతున్నాయి. సింపుల్ స్టెప్స్ అయినా కూడా చాలా ఈజ్‌తో ఈజీగా చేసారు ఈ బ్యూటీ. అందులోనే ఓ స్టైల్ ఉంది. అచ్చంగా సాయి పల్లవి కూడా ఇదే మ్యాజిక్ చేస్తుంటారు డాన్స్ చేస్తున్నపుడు..! ఆమె డాన్స్ చేస్తుంటే పాట రేంజ్ మారిపోతుంది. ఎంత కష్టమైన స్టెప్పైనా ఈజీగా చేయడంలో సాయి పల్లవి, శ్రీలీల స్పెషలిస్టులు. అందుకే వాళ్లు సినిమాలో ఉంటే డాన్సింగ్ సాంగ్స్ ఉంటాయి. మమిత కూడా ఇదే మ్యాజిక్ చేస్తున్నారు. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ కావడంతో డాన్సుల్లో రప్ఫాడిస్తున్నారు. మొత్తానికి ఈ నలుగురు బ్యూటీస్ తమ నటనతో ఎంత మాయ చేస్తున్నారో.. నాట్యంతోనూ అంతే మ్యాజిక్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

UPI ఛార్జీలపై కేంద్రం క్లారిటీ.. అప్పటి నుంచే అమలు

Top9 ET news: హమ్మయ్య.. ఇప్పటికి రూట్ క్లియర్…| రాజమౌళి నుంచి ఊహించని అప్‌డేట్

Suriya: ఇదే సరైన టైమ్.. మొదలైన సూర్య గేమ్..!

Allu Arjun: అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్.. ఒకేసారి రెండు సినిమాలు

షూటింగ్ అప్‌డేట్స్..ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలుసా..?

Follow Us