అది పింక్ డైమండ్ కాదు.. కెంపు వీడియో

Updated on: Sep 12, 2025 | 3:11 PM

టీటీడీలో రచ్చ పింక్ డైమండ్ వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది. మైసూరు మహారాజు తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించిన హారం లోని పింక్ డైమండ్ మాయమయిందన్న రచ్చ అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2018 లో తిరుమల శ్రీవారి హారంలోని పింక్ డైమండ్ మాయమైందని నాటి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణల పై కేంద్ర ఆర్కియాలజీ విభాగం అధ్యయనం చేసింది.

1945 లో మైసూరు మహారాజు శ్రీవారికి కానుకగా సమర్పించిన హారంపై ఆరా తీసింది. తిరుపతికి చెందిన మైసూర్ లోని ఎఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఈ అంశంపై లోతుగా పరిశీలించారు. ఈ క్రమంలో మైసూరు ప్యాలెస్ లో ఉన్న రికార్డులను తిరువాభరణం రికార్డులను పరిశీలించారు. మైసూరు మహారాజుకు సంబంధించిన ప్రతి వివరాలు భద్రపరిచిన రికార్డుల్లో దాదాపు 60 కాగితాలను పరిశీలించారు. 1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామ రాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని, బాల్యంలో ధరించిన తన హారాన్ని స్వామివారికి కానుకగా సమర్పించినట్లు వివరాలను బయటకు తీశారు. అప్పట్లో దాని విలువ రూ. 8500 లుగా ఉన్నట్లు రికార్డులను పరిశీలించి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్యాలెస్ డైరెక్టర్ నుంచి వివరాలు సేకరించారు.

మరిన్ని వీడియోల కోసం :

తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్‌ లక్షణాలు గుర్తింపు వీడియో

నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో

బస్సులో ఫోన్‌ పోగొట్టుకున్నారా.. జాగ్రత్త వీడియో

అలవాటుగా ఇంటి సీలింగ్‌వైపు చూసి వణికిపోయిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?వీడియో