సమయం వృథా చేస్తున్నారా ??ఈ టిప్స్ పాటిస్తే సక్సెస్ మీదే
జీవితంతో ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ, సమయం పోతే మాత్రం కోట్లు పెట్టినా తిరిగి రాదంటారు. అందుకే టైమ్‌ను మనీ కంటే విలువైనదిగా చెబుతారు. అయితే మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు కొందరి సమయాన్ని మొత్తం వృథా చేస్తాయి. జీవితంలో ఏది సాధించాలి అన్నాటైమ్ సెన్స్ అనేది చాలా ముఖ్యం.
సమయానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. మనం తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ మన సమయాన్ని తినేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియా మోజులో పడి గంటల తరపడి సమయం వృథా చేస్తున్నారు. ఏదైనా పనికి ప్లానింగ్ లేకపోయినా సమయం ఎక్కువగా వృథా అయ్యే అవకాశం ఉంటుంది. అవసరమైన నిద్రకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కూడా సమయం ఎక్కువగా వృధా అవుతుంది. అతిగా ఆలోచించడం కూడా అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇక పనులన్నీ ఆపుకొని గంటల కొద్దీ టీవీ చూడటం వల్ల సమయం వృథా అవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అవసరం లేని షాపింగ్ వల్ల మన పాకెట్ కి చిల్లు పడటంతో పాటు సమయం వేస్ట్ అవుతుంది. చిన్న పనైనా ముఖ్యమైనది అయితే వాయిదా వేయకుండా వెంటనే చేసేయాలి. ఇతరుల అభిప్రాయం కోసం వేచి చూడటం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది. ఒక పని పూర్తవ్వకుండానే మరొకటి చేపట్టడం వల్ల కూడా టైం వృథా. ఇతరులతో పోల్చుకుని మన పని మీద ధ్యాస పెట్టకపోవడం సమయాన్ని తినేస్తుంది. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేసినా టైం వేస్ట్ తప్ప లాభం లేదు. ఎదుటి వాళ్ల అభివృద్దిని చూసి ఈర్ష్యపడినా టైమ్ వేస్ట్.. అంతేకాదు ఆరోగ్యం సైతం దెబ్బతింటుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం కూడా టైం వేస్ట్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
